క్రీడాభూమి

యుఎస్ గోల్ఫ్ టోర్నీకి ఉడ్స్ డుమ్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓక్‌వౌంట్ (అమెరికా), జూన్ 9: అమెరికా గోల్ఫ్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ టైగర్ ఉడ్స్ ఈనెల 16న ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. గతంలో మూడు పర్యాయాలు ఈ టైటిల్‌ను సాధించిన ఉడ్స్ ఈ టోర్నీకి డుమ్మా కొట్టడం గత ఆరేళ్ల కాలంలో ఇది మూడోసారి. శారీరకంగా తాను యుఎస్ ఓపెన్ గోల్ఫ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా లేనని ఉడ్స్ ప్రకటించాడు. నిరుడు ఆగస్టులో విన్‌ధామ్ చాంపియన్‌షిప్‌లో చివరిసారి పాల్గొన్నాడు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వెన్నునొప్పికి రెండుసార్లు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందుకే తాను యుఎస్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీకి దూరం కావాల్సి వస్తున్నదని ఉడ్స్ ఒక ప్రకటనలో తెలిపాడు.