పశ్చిమగోదావరి

మమ్మల్ని ముంచేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూన్ 14: పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులమైన తమని అధికారులు అన్యాయం చేస్తున్నారని పైడిపాక నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పైడిపాక ముంపు గ్రామంలో 13 నిర్వాసిత కుటుంబాలవారు విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి తమ గోడు విన్నవించుకున్నారు. పైడిపాక గ్రామంలో 494 కుటుంబాలు ఉండగా, 13 కుటుంబాలకు చెందినవారం మాత్రమే ఉన్నామని, మిగిలిన వారు నిర్వాసిత గ్రామాలకు తరలివెళ్లినట్టు చెప్పారు. 13 సంవత్సరాలు నిండిన యువతులకు ప్యాకేజీ చెల్లించారు గానీ, నిజమైన నిర్వాసితులమైన తమకు అధికారులు రాజకీయ నాయకులు చెప్పినట్టు విని ఇంకా ప్యాకేజీలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికీ ఇళ్ల స్థలాల కేటాయింపులు జరగలేదని, జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం వద్ద సర్వే తోట చూపించారని, ఇంకా ఆ స్థలం చదునుచేయించి లే అవుట్లు వేయించాల్సి ఉందని వారు చెప్పారు. తమకు పొగాకు బ్యారన్లకు నష్టపరిహారం, పశువులపాకలు, చెట్లకు నష్టపరిహారం చెల్లించవలసి ఉందన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయించుకుండానే అద్దె ఇళ్లలోకి వెళ్లాలని అధికారులు వత్తిడి చేస్తున్నారన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తవ్వడానికి సుమారు అయిదు నెలల సమయం పడుతుందని, ఈ అయిదు నెలలకు ఇంటి అద్దెతోపాటు ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి నిర్వాసిత కుటుంబాలకు ఖర్చుచేస్తున్న రూ.3.15 లక్షలు తమకు చెల్లిస్తే తామకు నచ్చిన విధంగా గృహాలు నిర్మించుకుంటామన్నారు. అప్పటి వరకూ గ్రామాన్ని విడిచివెళ్లేలేదని నిర్వాసితులు బొట్టా త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు, బొట్టా శ్రీవారు తదితరులు స్పష్టం చేశారు.