అవీ .. ఇవీ..

మహిళ...నరసింహావతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్‌లో కార్తీకమాసం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడి ప్రఖ్యాత పటన్ దర్బార్ స్వేర్‌లో ఓ మహిళ ఇలా నరసింహావతారంలో చేసిన నృత్యం ఆహూతులను అలరించింది.

ట్రాన్స్‌జెండర్ షో
పాశ్చాత్య ప్రపంచంలో ఫ్యాషన్‌షోలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతాకాదు. ఇప్పుడక్కడ నపుంసకులు కూడా ఆ షోలలో తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. ఆ షోలకు ఆదరణా బాగానే ఉంది. ఇదిగో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఓ షోలో ఈ ఎల్‌జిబిటి మోడల్ ఎలా ఫోజిచ్చిందో చూడండి.
అక్వేరియంలో అందగత్తె
ఫ్యాషన్ రంగంలో కొత్తకొత్త ఆలోచనలకు స్వాగతం లభిస్తుంది. దక్షిణ స్పెయిన్‌లో ప్రఖ్యాత డిజైనర్ లూరుూస్ బెనిట్స్ రూపొందించిన దుస్తులతో ఓ మోడల్ ఓ అక్వేరియ్‌లో తన అందచందాలను ప్రదర్శించింది. ఈ షోకు అండలూషియా ఫ్యాషన్ షో అని పేరుపెట్టారు.
ఇదో కిటుకు
వ్యాపారంలో రాణించడానికి కొత్తకొత్త కిటుకులు ప్రదర్శించడం మామూలే. ఇదిగో ఈ ఎస్కలేటర్‌పై వస్తున్న ‘మినియన్స్’కూడా అలాంటి కిటుకే. తమ వ్యాపారాన్ని పెంచుకోడానికి ఓ డిపార్ట్‌మెంటర్ స్టోర్ ఈ ట్రిక్ చేసిందంతే.
రోబో తోడిపెళ్లికూతురు
ఎంత ఆధునిక పరిజ్ఞానం పెరిగినా దానికి ఓ సంప్రదాయాన్ని జోడిస్తే తప్ప వ్యాపారం సాగదు. ఆ నిజం తెలిసిన చైనాలోని ఓ రోబో తయారీ సంస్థ ఇదిగో ఇలా తోడిపెళ్లికూతురిమాదిరిగా ముస్తాబు చేసిన రోబోలను పెళ్లివేడుకలకు అందిస్తోంది. పూర్తిగా రోబోలతో నడిచే హోటల్‌కు రోబోట్స్‌ను అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఇలా పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు అవసరమయ్యే కొత్తకొత్త రోబోలను అందిస్తోంది. చైనాలోని తియాంజిల్‌లో ఈ రోబో తోడిపెళ్లికూతురు తెగ సందడి చేస్తోంది.

-భారతి