వీక్ పాయింట్

ఇదేమి రాజ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక స్కాము లేదు. ఒక స్కాండలు లేదు.
ఒక రంకు లేదు. బొంకు లేదు. ఇదెక్కడి ప్రభుత్వం? దేశాన్ని ఇలాగేనా నడపటం?
‘టైమ్ ఈజ్ మనీ’ అన్నాడు ఇంగ్లిషువాడు. పోయిన రోజు తిరిగి రాదు. దేశాన్ని ఎంతో కొంత దోచుకోకుండా, ఖజానాను ఏదోకాడికి కొల్లగొట్టకుండా పవర్లో ఒకరోజు గడిపావూ అంటే నీ అంత అవివేకీ, అప్రయోజకుడూ భూమీద ఉండడు. అలాంటిది - ఒకటీ రెండూ కాదు. ఏకంగా 365 రోజులు గోల్‌మాల్ ఏదీ చెయ్యకుండా నోళ్లు కట్టుకుని గడిపిన మోదీ సర్కారును మించిన వాజమ్మ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా?
యు.పి.ఎ. (ఉపా)ను చూసయినా ఉపాయాలు నేర్చుకోకపోగా, కల్పవృక్షాల్లాంటి కంపెనీల గోళ్లూడదీసి ఖజానాకు నాలుగు లక్షల కోట్లు జమచేయించగలిగామని గొప్పలు కూడానా? ఎన్ని లక్షల కోట్లు రాబట్టారని కాదు; ఎన్ని లక్షల కోట్లు కొట్టేశారన్నది కదా సర్కారు పనితీరుకు తూనికరాయి?
‘తిను-తిననివ్వు’ అన్నది గవర్నమెంటు పాలసీగా నడిచిన పదేళ్లూ అధర్మం నాలుగు పాదాల మీద ఎంత బాగా నడిచింది? అవినీతి స్వర్ణయుగం కాస్తాపోయి, ‘నేను తినను - ఒకరిని తిననివ్వను’ అనే గండాగొండి ప్రధానమంత్రి వచ్చి పడ్డాక ఈ దేశం ఎక్కడికి పోతున్నది? పరిపరి విధాల పైరవీలు చేసుకొని, ఒకరికొకరు సాయంపట్టి సహకార పద్ధతిలో అందరూ పైకివచ్చి లాభసాటి పోస్టులను, కాంట్రాక్టులను, అడ్డగోలు రాయితీలను అప్పనంగా కొట్టేయగలిగిన అచ్ఛేదిన్ పోయాయని మీడియా స్టార్లు మొదలుకుని, పారిశ్రామిక, వ్యాపార సంస్థల లాబీల గాళ్ల నుంచి రాజకీయ రాబందుల దాకా ఎందరో పుణ్యాత్ములు కుళ్లికుళ్లి ఏడుస్తుంటే, అసలైన ‘అచ్ఛేదిన్’ ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు డప్పులు కొడుతున్నారూ అంటే అది పుండుమీద కారం చల్లటమే కాదా?
ప్రజాస్వామ్య శాస్త్రార్థంగా ఒక రాజ్యాంగం ఉంటే ఉండవచ్చు. కాని దేశానికి కావలసింది కాంగ్రెసు మార్కు రాజ్యాంగం. పీటలమీద కూచోబెట్టటానికి తప్పదు కాబట్టి ఒక ప్రధానమంత్రి అంటూ ఉండొచ్చు. కాని అతగాడు నోరుండీ పలకలేని, కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని డమీ అయి ఉండాలి. అతడి నెత్తి మీద ఒక ఇటాలియన్ మమీ తిష్ఠవేయాలి. ఏళ్లొచ్చినా బుద్ధిరాని ఒక కుర్రకుంక కుర్చీ వెనక నుంచి అతడి చేతిని గట్టిగా పట్టుకుని కావలసిన సంతకాలు పెట్టించాలి. ఇవ్వాల్సిన స్టేట్‌మెంట్లు ఇప్పించాలి. తినాల్సిన చెప్పుదెబ్బలు తినిపించాలి. రాజ్యాంగేతర శక్తులే ప్రభుత్వాన్ని, రాజ్య వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఏ బాధ్యతా లేకుండా అంతులేని అధికారం చలాయించాలి. మంత్రులు, సామంతులు, అధికారులు ప్రధానమంత్రిని బొత్తిగా ఖాతరు చేయక రాజ్యాంగేతర అధికార కేంద్రాలకు మాత్రమే జవాబుదారీగా ఉండి స్వతంత్ర ప్రభువుల్లా తలలు ఎగురవేయాలి. తోక కుక్కను ఆడించినట్టు మిత్రపక్షాల నాయకులే ప్రభుత్వ నాయకుడిని కీలుబొమ్మను చేసి ఆడించగలగాలి.
కాని - జరుగుతున్నదేమిటి? ‘ఆఫ్టరాల్ ప్రధానమంత్రి!’ అని జనం జాలిపడవలసినట్టి కుర్చీలో ఇప్పుడు కూచున్నవాడు సర్వం తానే అయి ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు. మంత్రులనీ, అధికారులనీ ఇష్టానుసారం బతకనివ్వకుండా ఆఫీసువేళల్లో ఆఫీసు కుర్చీలకు కట్టేస్తున్నాడు. ఫైళ్ల అజాపజా ఎప్పటికప్పుడు కనుక్కుంటూ, ప్రభుత్వ యంత్రాంగానికి చెమటలు పట్టిస్తున్నాడు.
ప్రధానమంత్రి సర్వం సహాధిపత్యం చలాయించి సర్కారును నియంతలా శాసించటం మునుపు ఇందిరమ్మ హయాంలోనూ జరిగింది. కొంతవరకు ఆమె సుపుత్రుడి పాలనలోనూ దేశం తిలకించింది. కానీ వారు ఇండియాను ఇష్టారాజ్యంగా పాలించే స్పెషల్ డ్యూటీ మీద సెక్యులర్ దేవుడు పంపించిన పవిత్ర నెహ్రు వంశానికి చెందినవారు. ఆ వంశీకులు ఏమి చేసినా చెల్లుతుంది. వారు చేశారు కదా అని వేరే మానమాత్రుడూ అదే తెగువ చూపితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అవుతుంది. ఒక పనిని ఇందిర చేస్తే ‘దుర్గ’! అదే మోదీ చేస్తే నియంత!
ఈ చిన్న కామన్స్ పాయింటు మోదీకి అర్థం కాకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవచ్చు. ప్రధానిగా ఉన్న పదేళ్లలో ఎవరూ పట్టించుకోని, వినేవారు లేనందున అసలు నోరే తెరవని వౌనముని మనమోహన్ సర్దార్జీని ప్రధాని ఎలాగూ పిలిచి మాట్లాడాడు. ఆర్థిక శాస్త్రంలో పాఠాలు నేర్చుకునేందుకే ఆ ప్రైవేటు క్లాసు పెట్టించుకున్నాడని కాంగ్రెసు రాకుమారుడు దివ్య దృష్టితో కనిపెట్టాడు. నరేంద్రమోదీకి తెలివి అనేది ఉంటే ‘పాఠశాల’ ప్రక్రియను అంతటితో ఆపకుండా కొనసాగించాలి. ఏ సబ్జెక్టు ఎక్స్‌పర్టు దగ్గర ఆ సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్వాలి.
ఉదాహరణకు - ‘సూటూబూటు సర్కారు’ అని పేరు తెచ్చుకోగానే సరిపోదు. అసలు సూటు, బూటు అంటే ఏమిటో, వాటిలో ఎన్ని రకాలు ఉంటాయో, వాటితో ఎన్ని విలాసాలు, వైభోగాలు ఒలికించవచ్చో తమకా పేరు పెట్టిన రాహుల్ మాస్టారి నుంచి నేర్చుకోవాలి. ఇంకా బోధ పడకపోతే ఆ పిల్లవాడి తండ్రి, తాత, ముత్తాత, ఆ ముత్తాతకు నాన్నల పాత ఆల్బమ్‌లను చూసి గ్రహించవచ్చు. అలాగే కంపెనీలను దోచి, భూములు కొని, ఆ భూములు మళ్లీ ఆ కంపెనీలకే అమ్మి లాండ్ మేనేజిమెంటు ఎలా చేయాలో రాకుమారుడి బావాజీని అడిగి తెలుసుకోవాలి. ఎన్జీవోలను ఎలా మేపాలో, విదేశీ నిధులు దేశంలోకీ, సొంత నిధులను విదేశాలకూ ఎలా తరలించాలో, ఇటాలియన్ స్టయిల్‌లో దేశాన్ని ఎలా దంచాలో రాజమాత దగ్గర ట్యూషన్ తీసుకోవాలి. పార్లమెంటు తెరువు పోకుండా, నియోజకవర్గం వైపు కనె్నత్తి చూడకుండా ఎలా గడపాలో... సంక్షోభం వచ్చినప్పుడు జాడ లేకుండా విదేశాలకు ఎలా చెక్కెయ్యాలో... థాయ్ మసాజ్‌లతో, కొలంబియా ఫ్రెండ్సుతో ఖుషీగా ‘అంతర్మథనం’ ఎలా చెయ్యాలో నేర్పడానికి మళ్లీ రాహులబ్బాయే దిక్కు. అసలైన అదనులో 56 రోజులపాటు మాయమై విదేశాల్లో జల్సాలు చేసొచ్చిన ‘పెళ్లికాని పప్పూ’ కంటే మోదీ విదేశీ పర్యటనలపై క్లాసు తీసుకోగలిగిన మొనగాడు లేడు.
దేశాన్ని ఆరెస్సెస్ ‘శాఖ’లా నడిపిస్తే దేశం బాగుపడుతుంది. మైనరుబాబుకు ముద్దొచ్చిన కాంగ్రెసు మార్కు అరాచకాన్ని కొని
తెచ్చుకుంటే కాంగ్రెసు బాగుపడుతుంది. మొదటిది నయమనేవాడు ఫాసిస్టు. రెండోది కావాలనేవాడు సెక్యులరిస్టు.