పర్యాటకం

జ్యోతిర్లింగ దర్శనం.. మహాపాపహరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రతిష్టలింగాలు లేనే లేవు. అన్నీ స్వయంభూలింగాలు. వాటంతట అవే వెలసిన లింగాలు. స్వయంభూలింగాలనే జ్యోతిర్లింగాలు అని కూడా అంటారు. సర్వం జ్యోతిమయం. జ్యోతిమయ స్వరూపుడైన మహాశివుని దర్శనం కోసం జ్యోతిర్లింగాల క్షేత్రాలకు వెళ్లినపుడు పరమ పవిత్ర శివతీర్థాలలో స్నానం అత్యంత ఉత్తేజభరితం, సర్వపాపరహితం.
గుజరాత్‌లోని సోమనాధ దేవాలయం పవిత్రమైన ప్రభాస తీర్థానికి ప్రసిద్ధి. దక్ష ప్రజాపతి తన 27గురు కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. వారే 27 నక్షత్రాలు. వారిలో రోహిణి పట్ల ప్రేమ కల్గిన చంద్రుడు మిగతా భార్యలను నిరాదరిస్తాడు. అందుకు దక్షుడు చంద్రుడిని కుష్టువ్యాధిగ్రస్తుడవు కమ్మని శపిస్తాడు. దానితో చంద్రుడు క్షీణించటంతో కరువులు, వ్యాధులు, అకాల మరణాలు సంభవించాయి. బ్రహ్మదేవుని సలహాతో చంద్రుడు ప్రభాస తీర్థంలో స్నానం చేసి శాపవిమోచనం పొందాడు. సరస్వతి, కపిల, హిరణ్య నదుల కలయికతో త్రివేణి సంగమం కూడా ఇక్కడ ప్రసిద్ధి.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల మల్లికార్జన దేవాలయానికి మూడు మైళ్ళ దూరంలో పాతాళగంగ ఉన్నది. కృష్ణానది 550 అడుగుల ఎత్తునుండి క్రిందికి ప్రవహిస్తుంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి అభిషేకం చేయటానికి నీటిని తీసికొని వస్తారు. స్థలపురాణం ప్రకారం ఇక్కడ 3 కోట్ల 50 లక్షల తీర్థాలు ఉన్నాయని చెబుతారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయ ప్రాంగణంలో కోటి తీర్థం ఉన్నది. ఇది కోనేరు. పవిత్రమైన ఈ కోనేటిలో భక్తులు పాద ప్రక్షాళన చేసుకొని, ఆ కోనేటి నీటితో శివాభిషేకం చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి సందీపని ఆశ్రమం సమీపంలో గోమతికుండ్ వుంది. ఆశ్రమవాసులు ఈ నీటిని ఉపయోగిస్తారు. సిహు, కన్, సరస్వతీ నదుల త్రివేణి సంగమం ఇక్కడి ఆకర్షణ.
మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర క్షేత్రంలో నర్మదా నది ప్రసిద్ధి. శివలింగం క్రింద ఎప్పుడూ నర్మదానది నీరు వుంటుంది. అభిషేకపు నీరు నర్మదలో కలుస్తుంది. సిద్ధకూటమనే ప్రాంతంలో జైన తీర్థం, నర్మదలో కలిసే జలధార ‘కపిలధార’కూడా ప్రసిద్ధమైంది.
కేదార్‌నాధ్‌కు వెళ్ళేవారు గౌరీకుండ్‌లో వుండే వేడినీళ్ళ కుండలో స్నానం చేస్తారు. అది చిన్న కుండం అయినా చాలామందికి స్నానానికి అవకాశం వుంటుంది. ఇచ్చట హిమాలయ పర్వతాలను చూసి ఆనందిస్తూ, మందాకినీ నది ప్రవహం హాయిగొల్పుతుంది.
మహారాష్టల్రోని భీమశంకర జ్యోతిర్లింగ జన్మస్థానమే కృష్ణానది ఉపనది అయిన భీమానది. ఇక్కడ శివలింగాన్ని ముట్టుకొని అభిషేకం చేస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి- వరుణ, అసి అనే రెండు గంగానది ఉపనదుల సంగమ స్థానం. గంగానదీ తీరంలో అనేక స్మశాన ఘట్టాలున్నాయి. కేదార్‌ఘాట్, మణికర్ణిక, హరిశ్చంద్ర, దశాశ్వమేదఘాట్‌లు ఎంతో ప్రసిద్ధమైనవి. కాశీలోని కేదారకుండ్ అతి పవిత్ర తీర్థం, మహారాష్టల్రోని త్య్రంబకేశ్వర క్షేత్రం గోదావరి జన్మస్థానమైన గంగాద్వారం వద్ద వుంది. గోముఖం ద్వారా ప్రారంభమైన గోదావరి నీటితో శివుడు అనునిత్యం అభిషిక్తుడవుతాడు. ఇక్కడి గోదావరి కుండం కూడా స్నానాలకు ప్రసిద్ధి. జార్ఖండ్‌లోని వైద్యనాధ్ క్షేత్రంలో శివగంగ, క్షీరగంగ అనే తీర్థాలు వున్నాయి. ఇవి సర్వపాపహరం. శివలింగం క్రింది భాగంలో ఎప్పుడూ నీళ్ళు వుంటాయి. మహారాష్టల్రోని వైద్యనాధేశ్వర క్షేత్రం కూడా అతి పవిత్రమైనది.
మహారాష్ట్ర, గుజరాత్‌లలోని నాగేశ్వర జ్యోతిర్లింగం పశ్చిమ సముద్ర తీరంలోని దారుకావనంలో వుందని శివపురాణం చెబుతుంది. దేవాలయ ఆవరణలో ఎండిపోయిన సరస్సు వుంటుంది. ఆలయం బయట కోనేరు వుంది. నాగనాథ్ సమీపంలో గోపికల సరస్సు వుంది.
తమిళనాడులోని రామేశ్వరం బంగాళాఖాతంలో ద్వీపంగా వుండి, శంఖరూపంలో వుంటుంది. ఇక్కడ సముద్ర స్నానం విశేషం. ఆ తర్వాత రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలోని 21 తీర్థాలలో స్నానం 22వ తీర్థంలో స్వామివారికి అభిషేకం చేసిన నీరు తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు. ఇక్కడికి 8 కి.మీ దూరంలో నీలోంది తీర్థం వుంది. సముద్రం మీద నిర్మించిన పాంబన్ బ్రిడ్జి, 21 తీర్థాలు విశేషమైనవి.
మహారాష్టల్రోని ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగంలో శివతీర్థం వున్నది. కాశి, గయ, గంగ, నాశిక, త్య్రంబకేశ్వర, విశాల, ద్వారావతి, విరజ తీర్థాల సంగమమే శివాలయ తీర్థం. ఈ తీర్థస్నానంతో సర్వవ్యాధులు నయవౌతాయని భక్తుల విశ్వాసం.

- నిమ్మగడ్డ కాశీవిశే్వశ్వర శర్మ