క్రీడాభూమి

అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈస్ట్ రూథర్‌ఫర్డ్ (అమెరికా), జూన్ 27: అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కోపా అమెరికా ఫైనల్‌లో చిలీని ఢీకొన్న అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో విఫలమై, 2-4 తేడాతో ఓటమిపాలైంది. తన ప్రయత్నంలో విఫలమైన మెస్సీ నిరాశకు గురయ్యాడు. ఇదే తనకు చివరి మ్యాచ్ అని ప్రకటించాడు. అర్జెంటీనా జాతీయ జట్టుకు ఇకపై ప్రాతినిథ్యం వహించనని విలేఖరుల సమావేశంలో ప్రకటించి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాడు. నాలుగు పర్యాయాలు అర్జెంటీనాను మేజర్ టోర్నీలో ఫైనల్ వరకూ చేర్చినా టైటిళ్లను సాధించలేకపోవడం తనను బాధిస్తున్నదని 29 ఏళ్ల మెస్సీ వాపోయాడు. ఐదు పర్యాయాలు ఫిఫా అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా ఎంపికైన మెస్సీ ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌లో ఎన్నో శిఖరాలను అధిరోహించాడు. ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. బార్సిలోనా క్లబ్‌లో కీలక ఆటగాడిగా ఎన్నో విజయాలను అందించాడు. కానీ, అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడిన ప్రతిసారీ అతను విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది. అర్జెంటీనాకే చెందిన మరో ‘లెజెండరీ ఫుట్‌బాలర్’ డిగో మారడోనా ఎన్నోసార్లు మెస్సీపై విమర్శలు గుప్పించాడు. మెస్సీ మంచివాడేగానీ ఉత్తమ కెప్టెన్ కాడని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనాకు ఒక్క గోల్ కూడా రాదని జోస్యం చెప్పాడు. అతను అన్నట్టుగానే కోపా అమెరికా ఫైనల్‌లో అర్జెంటీనానను గెలిపించడంలో మెస్సీ విఫలమయ్యాడు. నిరుడు కూడా చిలీతో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా ఇదే రీతిలో ఓడింది. అప్పుడు కూడా మెస్సీనే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2014 ప్రపంచ కప్ ఫైనల్‌లో జర్మనీ చేతిలో మెస్సీ నాయకత్వం వహించిన అర్జెంటీనా ఓటమిపాలై, రన్నరప్ స్థానానికి పరిమితమైంది. అయితే, ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ, అర్జెటీనాకు సాధ్యమైనంత ఉత్తమ సేవలు అందించేందుకు అతను కృషి చేశాడు. కోపా అమెరికా టోర్నీ కోసం అతను స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా అర్జెంటీనాకు వెళ్లి, అక్కడ హోండురాస్‌తో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలోనే అతని వెన్నునొప్పి తిరగబెట్టింది. ఆ సమస్య నుంచి తేరుకోక ముందే పన్ను ఎగవేత కేసులో కోర్టు ముందు వివరణ ఇవ్వడానికి అతను బార్సిలోనాకు వెళ్లాడు. అక్కడ కోర్టు ముందు హాజరైన తర్వాత అప్పటికే అమెరికా చేరుకున్న జట్టుతో కలిశాడు. ఈ టోర్నీ ఆడుతున్నప్పుడే అతను 55వ అంతర్జాతీయ గోల్‌ను సాధించడం ద్వారా అర్జెంటీనా తరఫున ఎక్కువ గోల్స్ చేసిన ఫుట్‌బాలర్‌గా గాబ్రియెల్ బటిస్టుటా నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.

చిత్రం లియోనెల్ మెస్సీ