క్రీడాభూమి
డోపింగ్ పరీక్షలో విఫలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 July 2016
మొనాకో, జూన్ 30: బోస్టన్ మారథాన్ మాజీ చాంపియన్ లిడియా గ్రెగర్యెవాపై రెండున్నర సంవత్సరాల సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా ఆమెను సస్పెండ్ చేసినట్టు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ప్రకటించింది. 2007లో బోస్టన్ మారథాన్ టైటిల్ను గెల్చకున్న గ్రెగర్యెవా అంతకు ముందు ఏడాది జరిగిన యూరోపియన్ అథ్లెటిక్స్ మీట్ మహిళల 10,000 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 2010లో చికాగో మారథాన్ టైటిల్ను సాధించింది. కెరీర్లో మేజర్ టైటిళ్లను సాధించలేకపోయిన 42 ఏళ్ల గ్రెగర్యెవా రక్త నమూనాలో చాలాకాలంగా ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నాయని ఐఎఎఎఫ్ తన ప్రకటనలో తెలిపింది.
చిత్రం.. లిడియా గ్రెగర్యెవా