తెలంగాణ

భగ్గుమన్న జనగామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్/ మహబూబ్‌నగర్, జూలై 1: దసరానాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో సర్కారు కసరత్తు చేస్తుంటే, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జిల్లాలు ఏర్పాటు తగదంటూ నిరసనలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా కొద్దిరోజులుగా సాగుతున్న నిరసనలు శుక్రవారం హింసాత్మక సంఘటనలుగా మారాయి. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మొదలైన ప్రత్యక్ష ఆందోళనలు మిగతా జిల్లాల్లోనూ సెగపెంచి ప్రత్యక్ష కార్యాచరణకు మార్గం వేస్తున్నాయి. ఇప్పటివరకూ జనగామ జిల్లా ఏర్పాటు ఖాయమనుకుంటున్న తరుణంలో, యాదాద్రి జిల్లాలో కలిపే అవకాశం ఉందన్న సమాచారంతో శుక్రవారం జనగామ భగ్గుమంది. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఏకమై చేపట్టిన ఆందోళన హింసాత్మక ఘటనకు దారితీసింది. ఆందోళనకారులు హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఒకదశలో రెచ్చిపోయిన ఆందోళనకారులు జనగామ డిపో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టి, మరో 5 ఆర్టీసి బస్సులు, లారీలను ధ్వంసం చేశారు. జిల్లా ఏర్పాటుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మంత్రి హరీశ్, మరో వరంగల్ మంత్రి అడ్డుపడుతున్నారంటూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో సిఐ జీపు అద్దాలు పగులగొట్టారు. ఇదిలావుంటే, ములుగును జిల్లా కేంద్రంగా చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు ఆందోళన చేపట్టి, ములుగును కాదని భూపాలపల్లిని జిల్లా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకుంటే, ఆందోళన మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
మహబూబ్‌నగర్ నుంచి గద్వాలను విడదీసి జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ శుక్రవారంనాటి పరిణామాల్లో ఆందోళనరూపం తీసుకుంది. జోగులాంబ పేరిట గద్వాలను జిల్లా చేయాలని శుక్రవారం ఎమ్మెల్యే డికె అరుణ నేతృత్వంలో ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, రైతులు, మహిళలు హైదరాబాద్- బెంగళూరు 44వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులను ప్రజలు అడ్డుకున్నారు. అన్ని అర్హతలున్న గద్వాలను జిల్లా చేయకుండా వనపర్తిని ఎలా జిల్లా చేస్తారంటూ ఆందోళనలో డికె అరుణ ప్రశ్నించారు. ఈ రెంటిపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే, ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. కెసిఆర్ నిర్వహించిన చండియాగం ఫలాలు రాష్ట్రానికి అందలాంటే జోగులాంబ పేరిట గద్వాల జిల్లా కావాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా కెసిఆర్ ముక్కలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. చాలాసేపు ప్రజాప్రతిఘటనను ఎదుర్కొన్న పోలీసులు, చివరకు ఎమ్మెల్యేలు ఇద్దరినీ అరెస్ట్ చేసి ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకు తెదేపా, బిజెపి పార్టీలు సైతం మద్దతు తెలిపాయి.