హైదరాబాద్

పోలీస్ బాస్ ఇంట్లో హోంగార్డుల వెట్టిచాకిరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి వెట్టిచాకిరీ చేయించుకోవడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వర్గాలు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. హోంగార్డులతో వెట్టి చాకిరీ చేయించుకోవడంపై విచారణ జరపాలని ఇన్‌చార్జి డిజిపి అంజనీకుమార్, హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ శబర్వాల్‌కు ఆదేశాశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డులతో వంటపని, గొడ్ల చావిడిలోనూ పనిచేయించుకోవడంపై సోమవారం పూర్తి వివరాలు సేకరించి నిర్ణయం తీసుకుంటామని ఇన్‌చార్జి డిజిపి తెలిపారు. ఆర్డర్లీ వ్యవస్థను అధికారికంగా రద్దు చేసినప్పటికీ కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా హోంగార్డులతో ఇంటి పనులు చేయించుకుంటున్నట్టు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.
అది అవాస్తవం
హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాననే వార్త అవాస్తమని రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించమన్నందుకే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తాను సెలవులో ఉన్న సమయంలో క్యాంపు ఆఫీసులో ఆ దృశ్యాలు చిత్రీకరించారని తెలిపారు. దీని వెనుక అదనపు ఎస్పీ వెంకటస్వామి, సిసి మహేశ్‌ల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో తాను పశువైద్యాధికారిగా పనిచేశానని, పశువులు, పక్షులపై ప్రేమతో వాటిని ఇంట్లో పెంచుకుంటున్నానని చెప్పారు. అయితే తాను లేని సమయంలో గొడ్ల చావిడిలో చిత్రీకరించిన వీడియో దృశ్యాలపై విచారణ జరుపుతున్నామని, త్వరలో నిరూపిస్తానని ఎస్పీ నవీన్‌కుమార్ వివరించారు.