చిత్తూరు

వృద్ధులు, వికలాంగులు పింఛన్లలో కార్యదర్శుల చేతివాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 17: చనిపోయిన వారి పేర్లతో అనర్హులైన వారికి పింఛన్లు ఇచ్చామంటూ పెద్దతిప్ప సముద్రం కార్యదర్శులు తమ చేతి వాటం ప్రదర్శించి రూ.3.50 లక్షలు గోల్ మాల్ చేశారని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు, ఉపాధ్యక్షురాలు జి.అరుణలు ఆరోపించారు. ఆదివారం వారు తిరుపతిలో విలేఖరులతో మాట్లాడుతూ కాట్నగళ్లు పంచాయతీలో గత సంవత్సరంలో కూలీలు చేసిన పారం ఫండ్ పనులకు యేడాది పూర్తయినా బిల్లులు అందించలేదన్నారు. తద్వారా 13 మంది కూలీలు తమకు రావాల్సిన రూ.55 వేలు అందక ఇబ్బంది పడుతున్నామన్నారు. అదే పంచాయతీలో చనిపోయిన వారి పేర్లతో కార్యదర్శి రూ.21 వేలు తీసుకొని దిగమింగాడన్నారు. ఒక పంచాయతీ పరిధిలోనే ఇలా ఉంటే జిల్లా వ్యాప్తంగా ఎన్ని కోట్లరూపాయలు వృద్ధులకు రావాల్సిన ఫించన్లు వృధా అవుతున్నాయో అర్థమైపోతోందన్నారు. ఈ అంశాలపై జిల్లా అధికారులు స్పందించి విచారణ జరిపించి తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.