ఆంధ్రప్రదేశ్‌

నల్లధనం వెలికితీతలో ఆడిటర్లదే కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 22: నల్లధనం వెలికతీతలో ఆడిటర్లదే కీలకపాత్రని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాష్టస్థ్రాయి చార్టడ్ అకౌంటెంట్ల సదస్సు విశాఖలో శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి యనమల మాట్లాడుతూ నల్లధనం తెల్లధనంగా మారితే దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని అన్నారు. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలంటే ఆడిటర్లు నిజాయితీగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దేశ, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి ఆడిటర్లు జబాబుదారీగా నిలుస్తారని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా నల్లధనాన్ని నిలువరించలేకపోతోందని, జిడిపిలో 50 శాతం నల్లధనం పెరుగుతోందంటే అక్రమాలు ఏ స్థాయిలో చోటుచేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. నల్లధనం దేశ సంపదగా మారితే ప్రభుత్వాలు అప్పుల ఊబి నుంచి బయపడతాయని అన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే పన్నులు సక్రమంగా చెల్లించాలని కోరారు. ఆడిటర్లు నైతిక విలువలు పాటిస్తూ పన్ను ఎగవేతదార్ల భరతం పట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా అదనపు పన్నులు విధించకపోగా, పన్ను రాయితీలను కల్పిస్తోందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ఆడిటర్లు భాగస్వామ్యం కావాలన్నారు. ఆర్థిక వ్యవస్థలో జరిగే అవకతవకలు, ఇతర వ్యవహారాలపై దృష్టి సారించాలని కోరారు. జాతీయ చార్టెడ్ అకౌంటెంట్ల సంఘం అధ్యక్షుడు దేవరాజ్, ప్రతినిధులు ఫల్గుణ కుమార్, ఎం.జవహర్ రెడ్డి, విశాఖ బ్రాంచి అధ్యక్షుడు రామచంద్రరావు, వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆడిటర్ల సదస్సులో మాట్లాడుతున్న
ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు