రాష్ట్రీయం

నిలిచిన ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యలకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: గృహ నిర్మాణ జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో చాలా కాలం నుంచి అపరిషృతంగా ఉన్న సమస్యలను పరిష్కారం చూపాలని శుక్రవారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. వివిధ కారణాల వల్ల ఆగిపోయిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లోని ప్లాట్లు, విల్లాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది. దీంతో పాటు గృహ నిర్మాణ శాఖకు బకాయిపడ్డ రుసుంను వెంటనే చెల్లించాలని డెవలపర్స్‌కు క్యాబినెట్ సబ్ కమిటీ సూచించింది. గృహ నిర్మాణ శాఖ- ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంలో చేపట్టిన జాయింట్ ప్రాజెక్టు పెండింగ్ సమస్యలపై సచివాలయంలో శుక్రవారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ కుమార్‌తో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం గృహ నిర్మాణ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని మంథ్రి వర్గ ఉప సంఘం డెవలపర్స్‌కు సూచించింది. బకాయిలు చెల్లించక పోవడం, ఇతర సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ జరగక కొనుగోలు దారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.
5న చలో హైదరాబాద్
పోడు రైతులకు బాసటగా సిపిఐ పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 22: పోడు భూములపై పోరాటం సాగించేందుకు సిపిఐ సన్నద్ధమైంది. పోడు రైతుల పక్షాన నిలబడి ఆ భూములు రైతులకు దక్కేలా ఉద్యమ కార్యాచరణను సిపిఐ ఖరారు చేసింది. శుక్రవారం మీడియా సమావేశంలో పోడు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న చర్యలు, గిరిజన అటవీ హక్కు చట్టం తదితర అంశాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి వెల్లడించారు. ఈనెల 28నుంచి ఆగస్టు 3వరకు పోడు భూమి ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించి బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆగస్టు 5న వేలాది మంది పోడు రైతులతో చలో హైదరాబాద్ పేరిట భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు.