మీకు తెలుసా ?

నేలమీద బతికిన తొలిజీవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔను..రోకలిబండ అని పిలిచే సహస్రపాది (మిల్లిపెడె) నేలమీద మనుగడ సాగించిన తొలి జీవిగా శాస్తవ్రేత్తలు చెబుతారు. దాదాపు 480 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఆధారాలతో వారు ఈ విషయాన్ని చెబుతున్నారు. మిల్లిపెడె అంటే వెయ్యికాళ్ల జీవి అని లాటిన్‌లో అర్థం. నిజానికి అన్నికాళ్లు వీటికి ఉండవు. వందనుంచి 750 వరకు ఉంటాయి. జెర్రికి, రోకలిబండకు స్పష్టమైన భేదం ఒకటి ఉంది. జెర్రులకు ప్రతి ఖండిత ఫలకానికి జత కాళ్లుంటే రోకలిబండలకు రెండుజతల కాళ్లుంటాయి. అయినా ఇవి నెమ్మదిగా కదులుతాయి. ప్రమాదం ముంచుకొస్తే గుడ్రంగా చుట్టుకుపోతాయి. వీటి శరీరం రెండు భాగాలుగా ఉంటుంది. తల, మొండెంగా ఉంటాయి. ఇవి పుట్టినపుడు మూడు జతల కాళ్లు, మూడు ఖండిత ఫలకాలతో ఉంటాయి. నెమ్మదిగా ఎదుగుతాయి. వీటి జననాంగం మొండెం పూర్వభాగంలో, ఏడవ ఖండిత ఫలకంవద్ద ఉంటుంది. కాళ్లకు బదులు ఆ అంగం కన్పిస్తుంది. ఆడవాటిని ఆకర్షించేందుకు మగ రోకలిబండ నానాయాతన పడుతుంది. సిగ్గుతో, భయంతో చుట్టచుట్టుకుపోయే ఆడ రోకలిబండ పైభాగాని చేరుకున్న మగజీవి నెమ్మదిగా దాని ఉపరితలాన్ని మసాజ్ చేస్తూ, చిన్నపాటి సంగీతాన్ని విన్పిస్తూ మచ్చిక చేసుకుంటుంది. అన్నట్లు జెర్రులు మట్టిలో గుడ్లను పెట్టి స్వయంగా వాటిని చుట్టుకుని రక్షిస్తాయి. రోకలిబండలు గూళ్లలో గుడ్లు పెడతాయి. అదీ తేడా!

ఎస్.కె.కె.రవళి