చిత్తూరు

పారిశుద్ధ్య కార్మికులకు ధర్మబద్ధంగా జీతాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 22: రాత్రనక, పగలనక ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మలమూత్రాలను శుభ్రంచేసి పారిశుద్ధ్యాన్ని అందిస్తున్న కార్మికులు కడుపుకాలి పనిచేయడం ఆపితే ఆ పని మరొకరు చేయలేరని ధర్మబద్ధంగా జీతాలిచ్చి వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌కు విజ్ఞప్తిచేశారు. రుయాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన వందలాది కార్మికులతో కలిసి రుయా సూపరింటెండెంట్‌ను ఆయన ఛాంబర్‌లో కలసి విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రుయాలో పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి ముంబయికు చెందిన ఓ సంస్థలో ఆన్‌లైన్‌లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణం రద్దుచేసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా రోజుకు ఒక కార్మికుడికి రూ.400పై చిలుకు వేతనం చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంత్రి వర్గంలో కూడా రూ.7వేలు ఉన్న వేతనాలను రూ.12 వేలు చేయాలని నిర్ణయించిందని, త్వరలోనే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేయనున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంబైలో ఉన్న గుత్తేదారునికి రూ. 3 కోట్లు పనుల కోసం ఒప్పందం కుదుర్చుకుని ఇందులో రూ.1 కోటి 30 లక్షలు జీతాల కోసం కేటాయించడం ఎంత వరకు ధర్మమన్నారు. 200 మందికి యేడాదికి రూ.45 లక్షల రూపాయలు వేతనాలు ఇస్తే ఒక్కొక్కరికి నెలకు ఎంతవస్తుందో లెక్కలు వేయాల్సిన బాధ్యత మీది కాదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఎప్పుడు ధరలు మరింత పెరుగుతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి వాతావరణంలో 3 సంవత్సరాలకు గుత్తేదారులతో ఒప్పందాలు కుదర్చుకుంటే కార్మికుల బతుకేమి కావాలని ఆయన ప్రశ్నించారు. ఓవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటున్నాయని, కిలోబియ్యం రూ.50 ధర పలుకుతుందని, ఒక పప్పు దినుసులు కేజి రూ.200 పలుకుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లులేక అద్దింట్లో ఉంటూ పెరిగిన ధరలతో రూ.7వేల రూపాయలతో ఒక కార్మికుడు ఎలా కుటుంబాన్ని పోషిస్తాడని ఆయన ప్రశ్నించారు. అందులోనూ కార్మికులు కార్యాలయాల్లో కూర్చొని విధులు నిర్వహించడం లేదని ,మలమూత్రాలు శుభ్రంచేస్తూ అనేక వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. అలాంటి నిరుపేదలు వ్యాధుల బారిన పడితే రుయా ఆసుపత్రిలో తగినవైద్యం కూడా లేదన్నారు. చివరకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం వారు తమ శరీరంలోని భాగాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి రాదాఅని ఆయన ప్రశ్నించారు. నిరుపేదల కడుపులు కొడితే మంచిదికాదన్నారు. మనందరం నిరుపేదల కుటుంబం నంచి వచ్చినవారమన్నారు. రుయాలో డాక్టర్లు బాగా పనిచేస్తున్నా తగిన సౌకర్యాలు లేకపోవడంతో పేదలు బలైపోతున్నారన్నారు. రుయా ఆసుపత్రిలో గుండె, మెదడు, నరాలు, మూత్రపిండాలు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు రుయాలో విభాగాలు, వైద్యులు లేరన్నారు. ఇదే గుంటూరు, వైజాక్, కర్నూలు లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని విభాగాలు, డాక్టర్లు ఉన్నారన్నారు. ఈ క్రమంలో తిరుపతిలో ఉన్న పేదవారు చేసిన పాపమేమిటని ఆయన ప్రశ్నించారు. నిధులుకేటాయించాలని, విభాగాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని నాయకులకు సూచించారు. ప్రభుత్వానికి చేతకాకపోతే తాను రుయాకు నిధులు తీసుకొచ్చి పేద ప్రజల ప్రాణాలు కాపాడుతానన్నారు. తక్షణం గుత్తేదారులు పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకోని పారిశుధ్యకార్మికులకు న్యాయం జరిగేలా జీతాలివ్వకపోతే వారు పనిచేయరన్నారు. దీంతో రుయాలో దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అది ఇక్కడ పుట్టి పెరిగి చదువుకున్న వ్యక్తిగా రుయాలో ఇబ్బందికర పరిస్థితులు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే తాను హెచ్చరించడానికి వచ్చానన్నారు. రుయాలో ప్రతి పేదవానికి కార్పొరేట్ తరహాలో ఉచిత వైద్యం అందాలని, అలా జరగడంలేదని, పేదవాడికి ద్రోహం చేస్తున్నామని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. రూ.120 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రికి కేంద్రమంత్రి జయరాం రమేష్‌తో పునాదిరాయి వేయిస్తే చివరికి ఆ పునాది రాయిని కూడా లేకుండా చేసిన ఘనత రుయా ఆవరణంలో జరిగిందన్నారు. రుయాలో అంతాగొప్పగా ఉందని మాటలుచెప్పడం కాదని, చేతల్లో చూపించాలన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కార్మికులకు కన్నీళ్లక్షేత్రంగా మార్చవద్దని, అదేజరిగితే వారి కన్నీళ్ల సునామీలో ప్రభుత్వాలు కాలగర్భంలో కలుస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, శాంతి, శోభ, తేజోవతి, చాముండి, చంద్రకళ, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
రుయాను ఆధారంగా జీవిస్తున్న అంబులెన్స్ డ్రైవర్లకు న్యాయం చేయాలి రుయా ఆసుపత్రిలో వచ్చే రోగులను ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించడానికి అంబులెన్స్ పెట్టి జీవిస్తున్న వారికి తగిన న్యాయం చేయాలని తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్, రుయా సూపరింటెండెంట్ సిద్దార్థనాయక్‌కు విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి ఆవరణంలో అంబులెన్స్ పెట్టుకునే అవకాశం కల్పించాలని, ఎక్కువ సంఖ్యలో కాకపోయినా పరిమితి సంఖ్యలో అనుమతిస్తేవారు రొటేషన్ పద్దతిలో అంబులెన్స్ నడుపుకుంటారని సూచించారు. ఈసందర్భంగా ఆర్ ఎం ఓ ఆర్ ఆర్ రెడ్డి మాట్లాడుతూ ఒక అంబులెన్స్‌ను అనుమతిస్తున్నామని సమాధానం ఇచ్చారు. అలాకాకుండా ఎక్కువ మందికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా గిరీషా
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, జూలై 22: చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా గిరీషాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ జెసిగా ఉన్న భరత్‌గుప్తాను ప్రభుత్వం ఇటీవల శ్రీశైలం ఆలయ ఈవోగా నియమించింది. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా ఉన్న గిరీషాను జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జాయింట్ కలెక్టర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
పాల ఆటో బోల్తా : ఏడుగురు విద్యార్థులకు గాయాలు
రామచంద్రాపురం, జూలై 22: కుప్పం బాదూరు సమీపంలో పాల ఆటో బోల్తా పడటంతో ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళితే పరమాల నుంచి గంగి రెడ్డిపల్లి వైష్ణవి డెయిరీఫామ్‌కు పాలు తరలిస్తున్న ఆటోలో పరమాల, మిట్టకండ్రిగ, కుప్పం గ్రామాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు కుప్పంబాదూరు పాఠశాలకు వెళ్లడానికి ఎక్కారు. కుప్పం బాదూరు రైస్‌మిల్ సమీపంలో మలుపువద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో10వ తరగతి చదువుతున్న రమేష్, చలపతికి, 9వ తరగతి చదువుతున్న శ్రీనివాస్, జయంత్‌కు, 7వ తరగతి చదువుతున్న మధుసూదన్‌కు, 8వ తరగతి చదువుతున్న సాగర్‌కు, అదేవిధంగా తిరుపతి కళాశాలలో చదువుతున్న ఫృధ్వీకి తీవ్ర రక్తగాయాలయ్యాయి. కుప్పం బాదూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యులు డాక్టర్ గౌరీశంకర్ వీరికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఎస్ ఐ సురేష్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నాడు.
ముగ్గురు దొంగల అరెస్ట్
* 5లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, ట్యాబ్, సెల్‌ఫోన్ స్వాధీనం

తిరుపతి, జూలై 22: తిరుపతి-తిరుచానూరులో 7 ఇళ్లు, మహిళల మెడల్లో చెన్లుచోరీచేసి తప్పించుకుతిరుగుతున్న ముగ్గురు దొంగలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు క్రైం ఎ ఎస్పీ సిద్దారెడ్డి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.5లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్‌చేశామన్నారు. ఎ ఎస్పీ సిద్దారెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి సాయినగర్‌కు చెందిన బి.లోకేష్ (20), పునీత్‌రెడ్డి(21), ఎస్.్ఛంద్‌భాషా (29) అనే ముగ్గురు దొంగలు పలుచోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఈ క్రమంలో శుక్రవారం లోకేష్, పునీత్‌రెడ్డిని తిరుపతి రామానుజ సర్కిల్ వద్ద అరెస్ట్‌చేశామన్నారు. వీరు తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో 7 ఇళ్లల్లో చోరీచేసి 76 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ను చోరీచేసినట్లు అంగీకరించారన్నారు. వీరి నుంచి బంగారు ఆభరణాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారన్నారు. అలాగే వెంకటగిరికి చెందిన చాంద్‌భాష ప్రస్తుతం తిరుపతి చిన్నకాపువీధిలో నివాసం ఉంటూ చోరీలకు పాల్పడేవారన్నారు. తిరుపతి ప్రాంతాల్లో 3 చోట్ల మహిళల మెడల్లో బంగారు చైను దొంగలించాడన్నారు. గాంధీ రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద చాంద్‌భాషాను అరెస్ట్‌చేసి అతని వద్ద నుంచి 60 గ్రాములు బరువుకలిగిన 3 బంగారు చైన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారన్నారు. ఈ ముగ్గురు దొంగలను రిమాండ్‌కు పంపడం జరిగిందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు డి ఎస్పీ కొండారెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి క్రైం సి ఐ కె.శరత్‌చంద్ర, భాస్కర్‌లతో పాటు సత్యనారాయణ, పద్మలత, ఎస్ ఐ లు ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ పిళ్లై, ఆశీర్వాదం, రామ్మూర్తి, సుధాకర్ సిబ్బంది మునిరాజా, రాజశేఖర్, సుధాకర్, మురళి, వరక్ముని రెడ్డి, కామేశ్వరరావు, శివకుమార్, మురళీకృష్ణ, శేఖర్, శ్రీనివాసులు, రామయ్యలు నేరస్తులను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచారన్నారు. వీరికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. తాము ప్రజలకు విన్నవించేది ఏమిటంటే ఎవరైనా పనిమీద ఊరికి వెళ్లాల్సి వచ్చేటపుడు ఇంట్లో విలువైన వస్తువులను ఉంచవద్దని, ఈవిషయాన్ని పోలీసు శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉందన్నారు. అయితే ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దొంగతనాలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలు పోలీసులు ఇచ్చిన సూచనలను అనుసరించి నేరాలను అరికట్టడంలో సహకరించాలన్నారు. మహిళలు ఒంటరిగావెళ్లే సమయాల్లో కూడా విలువైన ఆభరణాలువేసుకోకూడదని ఆయన హితవు పలికారు.

24 నుంచి త్యాగరాజ జయంతి ఉత్సవాలు

* ఉత్సవ కమిటీ చైర్మన్ బీమాస్ రఘు వెల్లడి

తిరుపతి, జూలై 22: త్యాగరాజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 11రోజుల పాటు నిర్వహించనున్న 250వ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కమిటీ ఛైర్మన్ బీమాస్ రఘు తెలిపారు. శుక్రవారం స్థానిక బీమాస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు టిటిడి యాజమాన్యం ఎంతగానో సహకరిస్తుందని, ఇందుకు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి, ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 73 సంవత్సరాలుగా త్యాగరాజు ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడు త్యాగరాజుస్వామి 250వ జయంతి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఓ డాక్టర్ డి. సాంబశివరావు, ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరవుతారన్నారు. గాత్రంలో అరుణసాయిరాం, కదిరి గోపాల్‌నాథ్, ఘటం విద్వాంసులు వినాయకరావులకు విద్వన్‌మణి ఆవార్డులను అందించనున్నామన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, కంచి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలి
* 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి
తిరుపతి, జూలై 22: మదనపల్లి మునిసిపల్ చైర్మన్ వేధింపులకు బలవన్మరణానికి పాల్పడిన శ్రీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని రూ. 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలంటూ సి ఐ టి యు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ వేధింపుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గంగరాజు, సురేంద్ర, హరి, చిన్నామణి, వెంకటేష్, మళ్లి, గండి శ్రీను, పళణి తదితరులు పాల్గొన్నారు.
కుక్కల దాడిలో దుప్పి మృతి
పలమనేరు, జూలై 22: పలమనేరు పట్టణ సమీపంలోని గంటావూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం కుక్కల దాడిలో అడవి నుంచి వచ్చిన దుప్పి తీవ్ర గాయాలై మృత్యువాత పడింది. దీనిని గమనించిన స్థానికులు పలమనేరు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. అనంతరం అటవీ అధికారులు చట్టం ప్రకారం వణ్యప్రాణికి చేయవలసిన కార్యక్రమాలు చేపట్టారు. అటవీ సమీప గ్రామాల్లో వ్యవసాయ పొలాలపై దుప్పిలు, అడవి జంతువులు వస్తుంటాయి. ఈనేపథ్యంలో కొన్ని జంతువులు రాత్రి వేళల్లో వేటగాళ్ల తూటాలకు బలి అవుతున్నాయి. వణ్యప్రాణులకు రక్షణ కరువైంది. గ్రామీణ ప్రాంతాలకు వచ్చే అడవి జంతువులపై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడుతున్నాయి.
ఖాళీగా ఉన్న 1.5 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలి
* రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్

చంద్రగిరి, జూలై 22: రాష్టవ్య్రాప్తంగా 1.5 లక్షల ఉపాధ్యాయుల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలని బహుజన టీచర్ అసోసియేషన్‌కు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి ఆంజినేయులు డిమాండ్ చేశారు. చంద్రగిరిలోని ప్రాథమిక పాఠశాలలో బహుజన టీచర్స్ అసోసియేషన్‌కు చెందిన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్.మునికృష్ణయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్ల పల్లి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా లక్షలాది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని భర్తీ చేయకుండా చదువుతున్న యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనీయకుండా కాలయాపన చేస్తున్నదని అన్నారు. రాయితీల పేరుతో చిన్న చిన్న పూజల పేరుతో ఓట్ల రాజకీయాలు నడుపుతున్నారని, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కావున వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఉద్యోగాలు భర్తీచేయాలని అన్నారు. ఈసందర్భంగా కొన్ని తీర్మాణాలను ఆమోదించారు. 1.5 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డి ఎలు వెంటనే విడుదల చేయాలని, 398 రూపాయలతో పనిచేసిన ప్రత్యేక టీచర్లను వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలని డి ఆర్ ఎల్ అరియర్స్ బకాయిలను 10 నెలలకు జిపి ఎఫ్‌కు జమచేయాలని, పదవీవిరమణ చేయదలచుకున్న ఉపాధ్యాయులకు హాఫ్ పే లీవులను నగదుగా మార్చుకొనుటకు జి ఓ విడుదలచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజి ఎ నాయకుడు ఆదికేశవులు, విజయమోహన్, రాజేంద్ర, సదాశివం, గోపాలయ్య, బాలకృష్ణ, సుబ్బయ్య, వెంకటస్వామి, రాధాకృష్ణ, వాసు, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
27 నుంచి తిరువడిపురం ఉత్సవం
తిరుపతి, జూలై 22: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈనెల 27 నుంచి ఆగస్టు 5వ తదే వరకు ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవరోజుల్లో ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈనెల 29న, ఆగస్టు 5వ తేదీలలో సాయంత్రం అమ్మవారి ఊరేగింపులతో పాటు శుక్రవారం ఆస్థానం, ఈనెల 30వ తేదీన రోహిణి ఆస్థానం నిర్వహిస్తారు. ఆగస్టు 2వ తేదీన సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆండాళ్ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఆగస్టు 5వ తేదీన ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుంచి గీతామందిరం, రామనగర్, క్వార్టర్స్, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్ ఎస్ మాడ వీధి, చిన్నజియర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.
జాతీయ రహదారిపై దళిత సంఘాలు ధర్నా
వి.కోట, జూలై 22: స్థానిక అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై శుక్రవారం వివిధ దళిత సంఘాలు బిఎస్‌పి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా పలమనేరు నియోజకవర్గ బిఎస్‌పి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ జాతీయ బిఎస్‌పి పార్టీ అధ్యక్షురాలు మాయావతిని పార్లమెంట్‌లో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత ప్రతినిధులు సమాజంలో గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. మాయావతిని కించపరచిన బిజెపి నేతను కఠినంగా శిక్షించాలని వారు నినాదాలు చేసారు. అదేవిధంగా మండలంలో దళిత ఉద్యోగుల పట్ల వివక్షత చూపుతున్న ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాలని వారు హెచ్చరించారు. దళితుల పట్ల వివక్షతకు పాల్పడే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతటి వారైనా ఉద్యమాల ద్వారా తమ హక్కులను పరిరక్షించుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేసారు. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలను మోసగించిన ఘనత బాబుకే దక్కుతుంది
* ఎమ్మెల్యే నారాయణస్వామి విమర్శ

పెనుమూరు, జూలై 22: రాష్ట్ర ప్రజలను మోసగించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాల్లో తనదైన శైలిలో రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని చార్వగానిపల్లె పంచాయతీ పరిధి దాసరపల్లి, చార్వగానిపల్లి, పిఎస్ అగ్రహారం కాలనీ, అగ్రహారం ఊరు తదితర గ్రామాల్లో గడపగడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, రెండు రాష్ట్రాలు విడిపోయేందుకు కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసారు. అయితే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా తమదైన శైలిలో రాజధాని నిర్మాణంలో ప్రైవేటు కంపెనీలతో చేతులు కలిపి కోట్లు దండుకుంటున్నారని ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. ఈకార్యక్రమలో వైకాపా మండల కన్వీనర్ సురేష్‌రెడ్డి, విజయకుమార్, దాము, హరికృష్ణ, మార్కొండారెడ్డి, కమలాకర్‌రెడ్డి, మనోహర్, బాబు, దొరస్వామిరెడ్డి, దూది మోహన్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘నీటి ఆదాతోనే అధిక దిగుబడులు’
పెనుమూరు, జూలై 22: ప్రధానమంత్రి కిసాన్ వారి ఆధ్వర్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఉపాధిహామీ ఎడి శంకరయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన పెనుమూరులోని స్థానిక వ్యవసాయ కార్యాలయం ఆవరణలో రైతులకు నీటి వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారి శంకరయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఏకవార్షిక గడ్డి పెంపకంపై జొన్న, మొక్కజొన్న సాగుకు ఎకరాకు 11816 రూపాయలు సబ్సీడి రూపంలో విత్తనాలు అందిస్తున్నా మన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి హరిబాబునాయుడు, జడ్పిటిసి సభ్యుడు రుద్రయ్యనాయుడు, ఎఎంసి చైర్మన్ మోహన్‌నాయుడు, ఎఒ కిరణ్మయి, విస్తర్ణ్ధాకారి జయంతి, ఎఇఒలు రెడ్డిప్రియ, స్థానిక ఆదర్శ రైతులు తదితరులు పాల్గొన్నారు.