క్రీడాభూమి

హెరాత్ స్పిన్ మాయాజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, జూలై 30: రంగన హెరాత్ స్పిన్ మాయాజాలం ఆస్ట్రేలియాపై శ్రీలంకకు 17 సంవత్సరాల తర్వా త చారిత్ర విజయాన్ని సాధించిపెట్టింది. 38 ఏళ్ల హెరాత్ 54 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చి, ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో లంకను 106 పరుగుల తేడాతో గెలిపించాడు. ఆస్ట్రేలియాపై లంకకు ఇది కేవ లం రెండో టెస్టు విజయం కావడం విశేషం. కాగా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అర్ధ శతకం సాధించినప్పటికీ జట్టును ఆదుకోలేకపోయాడు. విజయానికి రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులు సాధించాల్సి ఉండగా, శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఆ సమయానికి విజయావకాశాలు ఇరు జట్లకు సమానంగా కనిపించాయి. అయితే, ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 161 పరుగులకే కుప్పకూలింది. స్మిత్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మిచెల్ మార్ష్ 25 పరుగులు చేశాడు. మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలమై, జట్టు పరాజయానికి కారణమయ్యారు. 33.3 ఓవర్లు బౌల్ చేసిన హెరాత్ ఐదు వికెట్లు పడగొడితే, లక్షన్ సండాకన్ 49 పరుగులకు 3 వికెట్లు సాధించాడు. లంక రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 34.2 ఓవర్లలో 117 ఆలౌట్ (్ధనంజయ డి సిల్వ 24, కుశాల్ పెరెరా 20, లక్షన్ సండాకన్ 19, నాథన్ లియాన్ 3/12, జొస్ హజెల్‌వుడ్ 3/21, మిచెల్ స్టార్క్ 2/51, స్టీవ్ ఒకీఫ్ 2/32).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 79.2 ఓవర్లలో 203 ఆలౌట్ (ఆడం వోగ్స్ 47, మిచెల్ మార్ష్ 31, స్టీవెన్ స్మిత్ 30, రంగన హెరాత్ 4/49, లక్షన్ సండాకన్ 4/58, నువాన్ ప్రదీప్ 2/36).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 93.4 ఓవర్లలో 353 ఆలౌట్ (కుశాల్ మెండిస్ 176 నాటౌట్, దినేష్ చండీమల్ 42, ధనంజయ డి సిల్వ 36, రంగన హెరాత్ 35, మిచెల్ స్టార్క్ 4/84, నాథన్ లియాన్ 2/108, జొస్ హాజెల్‌వుడ్ 2/59).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 268, ఓవర్‌నైట్ స్కోరు 3/83): 88.3 ఓవర్లలో 161 ఆలౌట్ (జొస్ బర్న్స్ 29, స్టీవెన్ స్మిత్ 55, మిచెల్ మార్ష్ 25, రంగన హెరాత్ 5/54, లక్షన్ సండాకన్ 3/49).

* శ్రీలంక తరఫున సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా కుశాల్ మెండిస్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఆస్ట్రేలియాపై శుక్రవారం సెంచరీ చేసే సమయానికి అతని వయసు 21 సంవత్సరాల 177 రోజులు. అంతకు ముందు 22 సంవత్సరాల, 267 రోజుల వయసులో కలువతిరన నెలకొల్పిన రికార్డును కుశాల్ మెండిస్ బద్దలు చేశాడు.
* ఆస్ట్రేలియాపై ఒక టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 150 లేదా అంతకు మించి పరుగులు సాధించిన రెండో శ్రీలంక బ్యాట్స్‌మన్‌గా కుశాల్ మెండిస్ చరిత్ర సృష్టించాడు. 2007లో హోబర్ట్‌లో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై కుమార సంగక్కర 192 పరుగులు సాధించాడు.

15 ఎల్‌బిలు
శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టులో మొత్తం 15 ఎల్‌బిలు నమోదయ్యాయి. శ్రీలంకలో జరిగిన టెస్టుల్లో ఇంత మంది ఎల్‌బిగా వెనుదిరగడం ఇది మొదటిసారి. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగోది.

* ఆస్ట్రేలియా ఓపెనర్ ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో అతి తక్కువ పరుగులు చేయడం 1994 తర్వాత మొదటిసారి నమోదైంది. డేవిడ్ వార్నర్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒక పరుగుకే వెనుదిరిగాడు. 1994లో పాకిస్తాన్‌తో కరాచీలో జరిగిన టెస్టులో ఓపెనర్ మార్క్ టేలర్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సున్నాకే అవుటయ్యాడు. 22 సంవత్సరాల కాలంలో ఎవరూ సున్నా లేదా ఒక పరుగుకు పరిమితం కాలేదు. వార్నర్ ఈ టెస్టులో ఒకే ఒక పరుగు చేసి, ఆసీస్ ఓపెనర్ల వైఫల్యాలను బయటపెట్టాడు.

హెరాత్ ఒక టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది ఆరోసారి. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ చెరి ఏడు పర్యాయాలు ఈ విధంగా రెండో ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు వికెట్లు కూల్చారు. ఆ జాబితాలో హెరాత్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు.

చిత్రాలు.. రంగన హెరాత్ , కుశాల్ మెండిస్