Others

నాకు నచ్చిన చిత్రం.. సతీ సుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొప్ప పౌరాణిక గాథను సమర్ధంగా చిత్రీకరించి సమాజానికి నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక విలువలు ప్రసరింపచేయటం ఆనాటి దర్శకులు, నిర్మాతలకు ఆదర్శంగా ఉండేది. అందుకు సతీసుమతి ఒక నిదర్శనం. సాధారణ మహిళ అయిన సుమతి -్భరత నారీమణులకు ఆదర్శమూర్తి అయ్యింది. అలాంటి పాత్రలో అంజలీదేవి జీవించింది అంటే అతిశయోక్తికాదు. సుమతి భర్త ఒక వ్యభిచారి. అయినా, అతణ్ణి ఆమె దైవంగా ఆరాధించి మానవాకృతి ధరించిన దేవతామూర్తిగా సేవించింది. భర్త కోరిక తీర్చటానికి, సానికి ఊడిగం చేసి, తన భర్తను రక్షించమని వేడుకున్నది. ఇక్కడ సుమతి త్యాగంకన్నా వెలయాలి త్యాగం గొప్పదని చర్చించటానికి వీలులేదు కాబట్టి, ఆ విషయాన్ని వదలి ముందుకు సాగాలి. సుమతి శాపాన్ని మరల్చి సూర్యోదయం సాధించటానికి ఆ త్రిమూర్తులు చాలలేదు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న సామెత ప్రకారం, సతీ అనసూయ కల్పించుకుని సుమతి చేత శాపాన్ని ఉపసంహరింపజేసింది. తన పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి, యతి వేషాలలో దిగివచ్చిన త్రిమూర్తులను అడ్డాలలో బిడ్డలుగా మార్చితే, సుమతి వారిని స్థాణువులుగా నిలబెట్టి, ఒక మెట్టుపైకి ఎక్కింది. లోకహితం కోసం భర్త తల పగిలి ప్రాణంపోయిన క్షణకాలం వైధవ్యాన్ని భరించింది. త్రిమూర్తులు ప్రసన్నులై సుమతి భర్తకు ప్రాణదానంతోపాటు పూర్తి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. ఒక స్ర్తి పతి భక్తి దైవభక్తికన్నా గొప్పదని, ఆమె పాతివ్రత్యం కుటుంబానికే కాకుండా సమాజానికి, ప్రపంచానికి రక్షాకవచం లాంటిదన్న సందేశాత్మక పౌరాణిక చలన చిత్రమిది. నాడూ.. నేడూ పేరెన్నికగన్న మేటి నటులను, నటీమణులను చిత్రం చివర ప్రవేశపెట్టి దర్శకుడు ప్రేక్షకులకు మరింత ఉత్సాహం కలిగించటం మరొక విశేషంగా చెప్పాలి. లక్ష్మీనారాయణులుగా అక్కినేని, కృష్ణకమారి, బ్రహ్మ సరస్వతులుగా ప్రభాకర్‌రెడ్డి, జమున, శివపార్వతులుగా జెమినిగణేశన్, సావిత్రి వెండి తెరపైన ఒకేసారి అతిథి పాత్రలు చేయటానికి అంగీకరించటం- వారికి దర్శక నిర్మాతలపై ఉన్న గౌరవానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో ఆనందంతోపాటు ఆలోచననూ రేకెత్తించే చిత్రమిది. సతీసుమతి నాకు చాలా ఇష్టమైన సినిమా.

-విఆర్ రావు, హైదరాబాద్