రివ్యూ

ఎన్నిసార్లు తెలిపినా అంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు..మరల తెలుపనా ప్రియా

తారాగణం:
ప్రిన్స్, వ్యోమనంది, సమీర్, రవివర్మ, ఫణి, సాయి, పూజా రామచంద్రన్
సంగీతం: శేఖర్‌చంద్ర
నిర్మాత: శ్రీ చైత్ర చలనచిత్ర
దర్శకత్వం: వాణి ఎం కొసరాజు
భావుకత్వం తాలూకు ఛాయలొలికించే ఈ టైటిల్.. తెలీని తీరాలకు నడిపిస్తుంది. పోస్టర్లపై అందంగా పరచుకొన్న ‘లవర్స్’ లేలేత ప్రేమ భావనలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఏదో ఫ్రెష్‌నెస్ తలపుల ఊయలలూగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే- ప్రేమ అనే అనుభూతి కనుల కొనలలో ప్రతిధ్వనించిన విశ్వరూప విన్యాసం. ‘లవ్’ కథల ఊపిరి దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉచ్ఛ్వాస నిశ్వాసలై వెలుగొందుతూనే ఉంది. కాబట్టి- ప్రేమ అన్న తీయటి చిరునామా సెల్యులాయిడ్‌పై భావుకత్వాన్ని వొలికిస్తూనే ఉంది. అందులో ‘త్యాగం’ మార్క్ ప్రేమకథలకు గిరాకీ కొద్దిగా ఎక్కువ. ట్రాజెడీ అంటే మరీనూ. ఈ ‘త్యాగం’ థియరీని బేస్ చేసుకొని ‘మరల తెలుపనా ప్రియా..’ అంటూ వచ్చిన ఆ ప్రియురాలి కథేంటో చూద్దాం.
హైఫై కల్చర్‌లో జీవితాన్ని కులాసాగా గడిపేస్తూ.. బైక్ రేస్, పార్టీలంటూ తెగ తిరిగేస్తూ.. అల్లారుముద్దుగా పెరిగిన డబ్బున్న పిల్ల వైషూ (వ్యోమనంది). కూతురి పెళ్లి చేసేస్తే ఓ బాధ్యత తీరిపోతుందని తెగ ఉబలాటపడే ఆమె తల్లిదండ్రులు. ఇలా వైషూ ‘మ్యారేజ్’ తర్జన భర్జనల మధ్య ఊగిసలాడుతూండగా.. జయకృష్ణ (ప్రిన్స్) అనే సంగీత దర్శకుడు పరిచయమవుతాడు. వారిద్దరూ ప్రేమలో మునిగితేలుతూండగా.. వైషూ పుట్టిన రోజు జయకృష్ణ ఉన్నట్టుండి అదృశ్యమవుతాడు. అతను ఎక్కడికి వెళ్లాడు? వైషూ ప్రేమలో ఈ అపశృతి వెనుక ఎవరున్నారు? అతని కోసం వెదుకులాటలో వైషూ ఎదుర్కొన్న కష్టాలేమిటి? చివరికి అతణ్ణి ఏ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది? ఇత్యాది సన్నివేశాల్తో కథ క్లైమాక్స్‌కి చేరుకుంటుంది.
ఈ సినిమా వ్యోమనంది కోసం మాత్రమే చూడాలి. ఎందుకంటే- హైక్లాస్ అమ్మాయిగా.. ఓ భగ్న ప్రేమికురాలిగా- తనదైన స్టైల్‌తో పాత్రలో జీవించింది. ఆ పాత్ర ఆమె కోసమే సృష్టించబడిందా? అన్నట్టు నటించింది. ఈ ఒక్క ప్లస్ పాయింట్ వినా -కథాపరంగా అనేకానేక ‘లాజిక్’లు వెంటాడి ఇబ్బంది పెడతాయి. తలకి బలమైన గాయమైతే- గతం’ చిప్ ఎర్రర్ చూపించటం.. నడుస్తున్న సన్నివేశాలు తప్ప.. ఫ్లాష్‌బ్యాక్ ఏదీ గుర్తుకు రాకపోవటం -లాంటి సబ్జెక్ట్స్ చూసేసి ఉండటంతో సహజంగానే ప్రేక్షకుల బుర్ర హీటెక్కుతుంది. దీంతో అసలు -చూస్తున్న సినిమా ఏమిటి? అన్న ఆలోచన కూడా తొలిచేస్తుంది. బుర్రంతా క్లీన్ చిట్ అయిన తర్వాత- ఒక పాట పాడితే.. మొత్తం రివైండ్ అయ్యి.. హీరోకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు గుర్తుకు రావటం చూస్తే.. కథ అనే వస్తువుని ఎటు పడితే అటు విసిరేసి చోద్యం చూస్తున్నట్టు అనిపిస్తుంది. గతం గుర్తుకొచ్చిన హీరో విలన్‌ని చితక్కొట్టేస్తాడు. అదేమిటో చోద్యం? ఈ కథలో ఏ కొత్తదనం కనిపించిందో తెలీదుగానీ.. తెర కెక్కించిన తర్వాత కూడా ‘మరల తెలుపనా ప్రియా’ భావుకత్వం కాదుగదా.. కనీసం ప్రేమ ‘్ఫల్’ని కూడా కలిగించలేక పోయింది.
లోబడ్జెట్ అంటే కథ కూడా ‘కింది స్థాయి’లో ఉండాలన్న సూత్రం ఎక్కడ్నుంచీ వచ్చిందో? త్యాగం మార్కు కథలూ.. మిస్సింగ్ కథలూ- అరిగిపోయి అన్నీ అటక ఎక్కేశాయి. తాజాగా ఈ చిత్రంతో ఏం ‘తెలిపారో’? ఏం తెలపాలి అనుకున్నారో మరి? ‘మరల’ తెలపటానికి ఇక్కడ విషయమేం లేదు.
వ్యోమ నంది తన భుజస్కంధాలపై కథని నడిపించినప్పటికీ.. ప్రేక్షకుడు ‘్ఫల్’ అయ్యేందుకు అంత సరుకు లేదు. ప్రిన్స్ తన పరిధిలో తాను నటించాడు. ఈ సినిమాకి కెమెరా చక్కగానే పనిచేసింది. ఐతే -కథా లోపం కారణంగా.. చూస్తున్న సన్నివేశాలు సైతం బోర్ కొట్టేసాయి. ‘ఏదో ఇది ఇదిగా ఉంది’ పాట అలరిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. దర్శకురాలిగా వాణి ఎం కొసరాజుకి మంచి మార్కులు పడటానికి కథ అవరోధంగా మారింది. కామెడీ ట్రాక్ కూడా మరల మరల రొటీన్‌గా ఉంది.

-బిఎనే్క