జాతీయ వార్తలు

తెలంగాణకు సిఎన్‌జి కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రానికి ఎంపీ బూర నరసయ్య గౌడ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: తెలంగాణలోని రవాణా రంగానికి, విద్యుత్ రంగానికి సిఎన్‌జి గ్యాస్ కేటాయించాలని టిఆర్‌ఎస్ సభ్యుడు బూర నరసయ్య గౌడ్ డిమాండ్ చేశారు. నరసయ్యగౌడ్ సోమవారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతూ తెలంగాణలో ఒక చమురు శుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం చమురు అవసరాలను పూర్తి చేసేందుకు చమురు శుద్ధి కార్మాగారం ఏర్పాటు ఎంతో అవసరమని ఆయన సూచించారు. భూరేలాల్ కమిటీ సిఫారసుల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 350 సిఎన్‌జి బస్సులను నడపాల్సి ఉండగా ప్రస్తుతం రెండు వందల బస్సులు మాత్రమే నడుస్తున్నాయని ఎంపీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి అదనపు సిఎన్‌జి కేటాయించాలని ఆయన కోరారు.