రాష్ట్రీయం

రజత సింధూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచిన తొలి మహిళగా రికార్డ్
ఉప్పొంగిన భారతావని
వెల్లువెత్తిన ప్రశంసలు...
నజరానాలు
పసిడి పతకాన్ని కైవసం
చేసుకున్న కరొలినా

అద్భుతంగా పోరాడావు. చారిత్రక విజయాన్ని సాధించావు. ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజతాన్ని సాధించిన నీ విజయం చారిత్రాత్మకం.
ఇందుకోసం కనబరిచిన పోరాట పటిమ తరతరాలకూ స్ఫూర్తిదాయకం..
మనసారా అభినందనలు

రజత పతకం గెలుచుకోవడం గర్వంగా ఉంది. టైటిల్ సాధించ
లేకపోయినా అందుకోసం చివరి వరకూ పోరాడాను. సాక్షి కాంస్యాన్ని గెలుచుకుంది. నేను రజతాన్ని సాధించాను. నా విజయం భారత బ్యాడ్మింటన్‌కు సరికొత్త స్ఫూర్తి కావాలి

సింధు గెలిచింది.
ఒలింపిక్స్‌లో భారత్ నెగ్గింది.
యావద్భారతం రజతకాంతులీనింది.
అప్రతిహత పోరాట పటిమ కనబరిచిన మన ‘సింధూ’రమే బంగారమై నిలిచింది.
ఒలింపిక్స్‌లో రజతాన్ని సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పూసర్ల వెంకట సింధు రికార్డునెలకొల్పింది. రియో వేదికగా తెలుగు క్రీడా తేజస్సును దశదిశలా చాటిన విజేతగా సింధు విజయం చిరస్మరణీయం. స్వర్ణం కోసం ప్రపంచ చాంపియన్ కరోలినాతో హోరాహోరీ.. తొలి సెట్ విజయంతో భారత్‌లో విజయ కేతనం. ఇక స్వర్ణం అడుగు దూరంలోనేనన్న ధీమా.. యావద్భారతం ఉత్కంఠతో.. రెండు, మూడు సెట్లనూ చూసింది. తానాడుతున్నది ఓ వరల్డ్ చాంపియన్‌తోనన్న బెరుకు ఏ కోశానా లేకుండా సింధు రాకెట్‌లా విజృంభించింది. అనుభవాన్ని, ప్రతిభను రంగరించి రియో కోర్టులో అంచనాలను పరుగులు పెట్టించింది. చివరి వరకూ ఉత్కంఠ, ఉద్వేగభరిత హోరాహోరీలో స్వర్ణం కరోలినాకే సొంతమైనా.. అందుకోసం తన శక్తియుక్తుల్ని జోడించి సింధు కనబరిచిన పోరాట పటిమ వర్ణనాతీతం. గెలిచింది స్వర్ణమా..
రజతమా అన్నదానితో నిమిత్తం లేదు. మన సింధు జన హృదయాన్ని దోచుకుంది. ఇదీ భారత సత్తా అని చాటిచెప్పింది. సింధు విజయంతో ఉప్పొంగిన భారతం ఆమెను ప్రశంసల వర్షంతో ముంచెత్తింది. ఇదిరా భారత్..ఔరా భారత్..వహ్వా భారత్ అంటూ ఆమె విజయంలో మమేకమైంది. అన్నిచోట్లా మువ్వనె్నల జెండా రెపరెపలాడింది. రాష్టప్రతి, ప్రధాని మొదలుకుని వివిధ రంగాలకు చెందిన ప్రతి ఒక్కరూ సింధూ విజయాన్ని చిరస్మరణీయంగా అభివర్ణించారు.