ఆంధ్రప్రదేశ్‌

దామాషా పద్ధతిలోనే ఎన్నికలు జరపాలి: సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 20: దేశంలో ధన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాల ఎన్నికలను దామాషా విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికల విధానం కారణంగా చట్ట సభల్లోకి ధనవంతులే వెళ్ళడంతో అక్కడ సామాన్యునికి న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో శనివారం ‘్ధన రాజకీయాలు-ఎన్నికల సంస్కరణలు’ అనే అంశంపై వామపక్ష నేతలు సదస్సు నిర్వహించారు. సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ దేశంలోని పార్లమెంట్‌లో 542 సభ్యులకు గాను 443 మంది సభ్యులు కోటీశ్వరులేనని తెలిపారు. వారు ఆయా నియోజకవర్గాల్లో 25 నుండి 30 కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేసి గెలిచినవారేనని చెప్పారు. రాష్ట్రంలోని 29 పార్లమెంట్ సభ్యుల్లో 25 మంది కోట్లకు పడగలెత్తినవారున్నారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్ర మంత్రి పి నారాయణ 436 కోట్ల ఆస్తులతో అగ్రభాగాన ఉన్నారన్నారు.