రాజమండ్రి

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 19: తెలంగాణ ప్రాంతంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని భీమా ప్రాజెక్టుకు సంబంధించిన ప్యాకేజి 46తోపాటు శంకరసముద్రం, రామన్‌పాడు ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వలను మంత్రి పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని పంచదేవ్‌పాడ్ గ్రామ సమీపంలో గల ప్రాజెక్టు పనులను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఇ ఖగేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. రైతులకు, గ్రామస్థులకు అందించే పరిహారంపై కూడా ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించేదిపోయి గగ్గోలు పెట్టడం మానుకోవాలని హితవుపలికారు. కొత్త రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా ఎంతో అవసరమని అన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రాంతంలో కృష్ణా, గోదావరి జలాలు రైతుల పొలాల్లోకి రాలేకపోయాయని, స్వరాష్ట్రం వచ్చాక ఈ జలాలు రైతుల పొలాల్లో పారించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకు వలసల జిల్లాగా పేరుందని, ఆ పేరు రూపుమాపాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ఎంతో అవసరమని అన్నారు. ఆంధ్ర నాయకులు పాలమూరు ఎత్తిపోతల పథకంపై రాద్ధాంతం చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆంధ్ర, సీమ ప్రాంతంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడుతో పాటు పలు ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు.