కడప

స్కూల్ రుణం తీర్చుకుంటా పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, సెప్టెంబర్ 19: స్కూల్ రుణం తీర్చుకుంటా పథకాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నట్లు మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యారంగాన్ని అభివృద్ధి దిశగా ముందుకెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడప జిల్లా రాజంపేటలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, ప్రస్తుతం ఉన్నత స్థానానికి చేరుకున్నవారిని గతంలో వారు చదివిన స్కూల్ అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకానికి మంచి స్పందన లభిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని సూళ్లలో సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి రూ.5 వేలు చొప్పున కేటాయించారన్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై దృష్టి సారించినట్లు గంటా తెలిపారు. 1:30 పద్దతిలో 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, అయితే ప్రస్తుతం 1:18 పద్దతిలో 18 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడున్నారన్నారు. అయితే కొన్నిచోట్ల ఎక్కువ తక్కువగా ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారని, దీన్ని సరిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ సెంటర్‌గా మార్చడం, నాణ్యమైన విద్య అందించడం, విద్యార్థుల్లో ఆదర్శభావాలు పెంపొందించి వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన అని, తదనుగుణంగా విద్యారంగంలో మార్పులు తీసుకువస్తామని మంత్రి గంటా తెలిపారు.