ఖమ్మం

వ్యవసాయ అధికారుల ఘెరావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిజర్ల, సెప్టెంబర్ 22: మండల పరిధిలోని సింగరాయపాలెంలో రైతులు గురువారం వ్యవసాయ అధికారులను నిర్బంధించారు. గ్రామంలో వందమందికి పైగా రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఓ కంపెనికి చెందిన మిరప విత్తనాలు సాగు చేశారు. ఇప్పటి వరకు ఎకరాకు ముపై నుంచి యాబై వేల వరకు ఖర్చు చేసి, ఆ కంపెనికి చెందిన మిరప విత్తనాలతో తోటలు సాగు చేశారు. రెండు నెలల పాటు ఆశాజనకంగా ఉన్న పైరుకు ఇటీవల వారం పది రోజులుగా గుబ్బ తెగులు వైరస్ సోకింది. బాధిత రైతులు విషయాన్ని సంబంధిత కంపెని అధికారులకు విషయం తెలిపినప్పటికీ ఫలితం లేదు. దీంతో ఆందోళన చెందిన రైతులు గత రెండు రోజులుగా ఆందోళ చేస్తున్నారు. రైతులతో మాట్లాడేందుకు గ్రామానికి వెళ్ళి వైరా ఎడిఏని రైతులు చుట్టుముట్టి జెడిఏ వచ్చి సమాదానం చెప్పాలని, నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో జెడిఏ గ్రామానికి వెళ్ళగా రైతులు చుట్టుముట్టి ఆందోళనకు పూనుకున్నారు. రెండుగంటల పాటు కదలనివ్వలేదు. ఈ నేపథ్యంతో జెడిఏ పలు దఫాలుగా కంపెని ఎండితో చర్చలు జరిపారు. శుక్రవారం వస్తానని ఎండి చెప్పినట్లు జెడిఏ రైతులకు చెప్పడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ఖమ్మం ఎడిఏ ప్రమీళ, హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ, కెవికె సైంటిస్ట్ హేమంత్‌కుమార్, సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, రైతుసంఘం నాయకులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, తాళ్ళపల్లి కృష్ణ, వడ్లమూడి నాగేశ్వరరావు, రోషన్, ఎన్‌డి నాయకులు కిచ్చెల రంగారెడ్డి, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, అర్జున్‌రావు, లాల్‌మియా తదితరులు పాల్గొన్నారు.