ఖమ్మం

మన్యంలో కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 22: వాయుగుండం కారణంగా భద్రాచలం మన్యంలో గురువారం కుండపోతగా వర్షం కురిసింది. ఏజెన్సీలోని వాగులు, కుంటలు, చిన్నచిన్న చెరువులు వర్షపు నీటితో హోరెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భద్రాచలంలో 10.8 మి.మీలు, చర్లలో 24మి.మీలు, వాజేడులో 37.2 మి.మీలు, వెంకటాపురంలో 18.4 మి.మీలు, దుమ్ముగూడెంలో 41.8 మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది. తాలిపేరుకు ఎగువన దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక్కడ 7 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 18,396 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. రిజర్వాయర్‌లో నీటి నిల్వ 73.40 మీటర్లు కాగా డ్యాంలోకి వస్తున్న వరద 18,648 క్యూసెక్కులు. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలంల్లో గురువారం రాత్రి కూడా భారీగా వర్షం కురిసింది. భద్రాచలం పట్టణంలోని విజయవాడ-జగదల్‌పూర్ జాతీయరహదారిపైకి వర్షపు నీరు చేరింది.