సబ్ ఫీచర్

ఆకుకూరల్లో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్య జీవితంలో మనం మన శరీర ఆరోగ్య పరిరక్షణ కోసం తాజా ఆకుకూరలు ఉపయోగించడం శ్రేయస్కరం. మనం ప్రతినిత్యం కూరల్లో ఏం ఉపయోగించాలా అన్న సందేహం వద్దు. ఆకుకూరలని చిన్నచూపు చూడకండి. తాజా ఆకుకూరలు మనకు నిత్యం పోషక విలువలు సమృద్ధిగా అందించగలదు.
తాజా ఆకుకూరలులో పొదినా, బచ్చలి, తోటకూర, మెంతాకు, గోంగూర మొదలైనవి మనకు మార్కెట్‌లో దొరికే ఆకుకూరలు అతి తక్కువ ధరల్లో దొరుకుతాయి. తక్కువ ధర అయినప్పటికీ ఎక్కువ ప్రయోజనం కలిగే ఆకుకూరల్లో విటమిన్లు, పోషక విలువలు మెండుగా ఉన్నాయి.
స్ర్తిల సౌందర్యకాంతికి ఆకుకూరలు కూడా దోహదం చేస్తాయి. తాజా ఆకుకూరల్లో రిబొప్లేవిన్, విటమిన్ ఎ ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకుకూరలతోబాటు ములగ ఆకు, చింతాకు కూడా ప్రయోజనకారి. చుక్కాకులో సైతం పోషకాలు అధికంగా వున్నాయి.
మన పెరట్లో ఆకుకూరలు పెంచడం ఎంతో మంచిది. కంటికి మేలు చేసే గుణం ఆకుకూరల్లో లభిస్తాయి. జీర్ణశక్తి, ఉత్సాహం తాజా ఆకుకూరల్లో పుష్కలంగా వుంటాయి.
చిన్నారులకు ఆకుకూరలు అలవాటు చేయాలి. గర్భిణీలు ఆకుకూరలు ఉపయోగించడం వలన వారికి ఆరోగ్యదాయకం కాగలదు.
గోంగూరలో ఖనిజం, ఇనుము, ఐరన్ విటమిన్లు వున్నాయి. తాజా తోటకూరలో పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. మనిషి ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో అవసరం. ఆకుకూరలు వండేటప్పుడు ఎక్కువగా ఉడకనీయరాదు. అలా చేయడంవలన వాటిలో విటమిన్లు కోల్పోతాయి. ఆకుకూరలు ప ప్పు కలిపి చేసుకోవడం మంచిది. కందిపప్పుతో కలిపి ఆకుకూరలు చేయ డం చాలా ప్రయోజనకరం. పేదవాడికి ఆకుకూరలే ఎంతో అందుబాటు ధరల్లో లభిస్తాయి. పైగా పోషక విలువలు అధికం అని అందరూ గ్రహించాలి.
***

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- ఎల్.ప్రపుల్ల చంద్ర