రాష్ట్రీయం

పోలీస్ సంస్కరణలు అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రతి దేశానికి అంతర్గత, బహిర్గత సమస్యలుంటాయని, వీటిని ఎదుర్కోవడంలో పోలీస్ భద్రత ప్రధానమైందని, దీనికి పోలీస్ శాఖలో సంస్కరణలు అనివార్యమని ఉత్తరప్రదేశ్, అస్సాం మాజీ డిజిపి ప్రకాష్ సింగ్ అన్నారు. మంగళవారం రావుబహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రావు స్మారక ఉపన్యాసంలో ‘పోలీస్ సంస్కరణలు-అంతర్గత భద్రత’పై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘్భరతదేశం స్వాతంత్రం సిద్ధించిన మూడేళ్లలోనే ఒకవైపు మనం ఎలా అభివృద్ధి చెందాలో ప్రణాళికలు వేస్తూ, మరోవైపు పాకిస్తాన్ నుండి వచ్చిన కాందిశీకుల పునరావాసంలో ప్రభుత్వం పనిచేస్తుంటే, మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో అప్పటికే అభద్రతా భావం ఏర్పడి నాగాలాండ్‌తో సహ మిజోరాం, మేఘాలయలో ఉద్యమాలు జరిగాయి.
1960 ప్రాంతంలో వామపక్ష భావజాలంతో నక్సల్స్ పోరాటం ప్రారంభం కావడం, 1970లో ఉల్ఫా ఉద్యమంతో అస్సాం రాష్ట్రం అట్టుడికి పోవడం, 1980 ప్రాంతంలో ఖలిస్తాన్ పేరుతో పంజాబ్‌లో తీవ్రవాదం పెరిగిపోవడం, అనంతరం అనేక పేర్లతో అంతర్జాతీయ ఉగ్రవాదం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి’ అని అన్నారు. వీటి నుంచి ఎదుర్కోవాలంటే పోలీస్ సంస్కరణలు అవసరమని ప్రకాష్ సింగ్ అన్నారు. దేశంలోని 120 కోట్ల జనాభాకు నిష్పత్తి ప్రకారంగా చూస్తే..ఒక లక్ష మందికి ప్రస్తుతం 139 పోలీసులు మాత్రమే ఉన్నారని, సుమారు 50 లక్షల పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పోలీస్ శాఖలోని ఖాళీలు భర్తీ చేసి వారికి కనీస వౌలిక సదుపాయాలైన వాహనాలు, టెక్నాలజీ, హౌసింగ్, పని గంటలు, మంచి శిక్షణ వంటివి అందిస్తే పనిలో వేగం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మ మాట్లాడుతూ తెలంగాణ కొత్త రాష్టమ్రైనప్పటికీ మిగతా రాష్ట్రాల్లో లేనివిధంగా ఎన్నో వసతులు ఇక్కడి పోలీసులు పొందుతున్నారన్నారు. ఇందుకు ప్రత్యేక నిధులు కేటాయించి పోలీస్ శాఖ పటిష్టతకు కృషి సల్పుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకాష్ సింగ్ తమ ఉపన్యాసంలో పేర్కొన్న షార్ట్ఫాల్స్ తెలంగాణలో ఎక్కువగా లేవన్నారు.
chitram...

పోలీస్ సంస్కరణలు-అంతర్గత భద్రతపై జరిగిన సదస్సులో
ప్రసంగిస్తున్న యుపి, అస్సాం మాజీ డిజిపి ప్రకాష్‌సింగ్