జాతీయ వార్తలు

రాష్ట్రాల అభిప్రాయాలను మినిట్స్‌లో ఎందుకు చేర్చలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టం ప్రకారం ప్రస్తుత రిజిష్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్లను టర్నోవర్‌తో సంబంధం లేకుండా కేంద్ర పన్నుల వ్యవస్థ పరిధికిలోకి తీసుకురావటం తమకు ఎంత మాత్రం ఇష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. జిఎస్‌టిపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత రిజిష్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్లను కేంద్ర పన్నుల వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు గత జిఎస్‌టి సమావేశంలో ఎలాంటి అవగాహన కుదరలేదరకపోయినప్పటికీ ఆ సమావేశ మినిట్స్‌లో దీనిని ఎలా చేర్చారని, రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్లను కేంద్ర పన్నుల వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించాయని ఎలా చెబుతారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై గత జిఎస్‌టి సమావేశంలో కూడా తాను అభ్యంతరం తెలిపిన విషయాన్ని యనమల కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రస్తుత సర్వీస్ పన్ను చెల్లంపుదారుల అంశం కేంద్రంతో పాటు రాష్ట్రాల పరిధిలో ఉండాలనేది తమ అభిప్రాయమని ఆయన తెలిపారు. గత జిఎస్‌టి సమావేశంలో రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మినిట్స్‌లో ఎందుకు పొందుపరచలేదని, తాము చెప్పినదానికి భిన్నమైన అభిప్రాయాలను మినిట్స్‌లో ఎలా చేర్చారని యనమల కేంద్రాన్ని నిలదీశారు.