జాతీయ వార్తలు

ఇరుకునపడ్డ పాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ దాడులు జరిపిన భారత్‌పై ప్రతి దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించటంతో పాకిస్తాన్ ఇరకాటంలో పడినట్లు తెలిసింది. భారతపై ప్రతి దాడులు చేసి అభాసుపాలయ్యే బదులు ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఎత్తివేయాలనీ, ఇస్లామిక్ ఉగ్రవాదులను అదుపు చేయాలని అమెరికా గత రాత్రి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో భారత్‌పై ప్రతి దాడులు చేసే అంశంపై పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా ఆ దేశ సైన్యం కొంత ఇరకాటంలో పడిందని అంటున్నారు. భారత్‌పై ప్రతి దాడులతో ఏర్పడే ఉద్రిక్తతలను, వాటి పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ప్రతి దాడులకు దిగితే పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నదనేది మరిచిపోరాదని అమెరికా హెచ్చరించిందని అంటున్నారు. భారత్‌తో ప్రత్యక్ష యుద్ధానికి దిగితే అమెరికానుండి ఎలాంటి మద్దతు ఉండదనేది కూడా పాకిస్తాన్‌కు స్పష్టం చేసినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. పాక్‌లోని అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడే ప్రమాదం ఉన్నదంటూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న హిల్లరీ క్లింటన్ చేసిన ప్రకటనతో ఆందోళనకు గురవుతున్న అభివృద్ధి చెందిన పలు దేశాలు కూడా ప్రతి దాడులకు దిగి పరిస్థితిని మరింత దిగజార్చకూడదని పలు అభివృద్ధి చెందిన దేశాలు పాకిస్తాన్‌కు దౌత్యవర్గాల ద్వారా సలహా ఇచ్చినట్లు తెలిసింది. పలు ఆసియా దేశాలతోపాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉద్రిక్తతను పెంచవద్దంటూ సలహాలు ఇస్తున్న నేపథ్యంలో తాము భారతపై ప్రతిదాడులకు దిగితే ఏకాకి అవుతామనే ఆందోళన పాకిస్తాన్ ప్రభుత్వంలో వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు పలు దేశాలు తెర వెనక దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదానికి తెరదించటం ద్వారా ఆసియాలో శాంతి స్థాపనకు కృషి చేయాలని ఆయా దేశాలు పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.