జాతీయ వార్తలు

చరిత్రాత్మక పారిస్ ఒప్పందానికి నేడు భారత్ ఆమోదముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పర్యావరణంపై చరిత్రాత్మక పారిస్ ఒప్పందానికి భారత్ ఆదివారం గాంధీ జయంతి నాడు ఆమోదముద్ర వేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ఆమోదం తెలిపిన ఈ ప్రతిపాదనకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సైతం తన ఆమోదం తెలపడంతో ఈ ఒప్పందానికి మన దేశం ఆమోదముద్ర వేయడానికి రంగం సిద్ధమైంది. ఈ ఒప్పందం అమలులోకి రావడానికి ప్రపంచంలోని పలు దేశాలతో పాటుగా మన దేశం కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ‘రేపు(ఆదివారం) ఐక్యరాజ్య సమితిలో మనం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర తెలుపుతాం, రాష్టప్రతి దీనిపై సంతకం చేశారు. కేంద్ర మంత్రివర్గం సైతం ఇదివరకే దీనికి ఆమోదం తెలిపింది’ అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే శనివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. గాంధీజయంతి రోజున భారత్ ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 25న ప్రకటించిన విషయం తెలిసిందే.
కోజికోడ్‌లో జరిగిన బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని ఈ విషయం ప్రకటించిన మూడు రోజుల తర్వాత గత నెల 28న కేంద్ర మంత్రివర్గం సైతం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం తెలిసిందే. అంతర్జాతీయ ఒత్తిడి కావచ్చు లేదా పోటీ కావచ్చు, ఏదయినా కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కూడా ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేయాలని ఈ రోజు ఉదయం నిర్ణయించిందని, ఇది చాలా మంచి పరిణామమని దవే చెప్పారు. భారత్ ఈ ఒప్పందానికి ఆమోదం తెలపడంతో పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషించిన మన దేశం ఆ విషయంలోను ముందున్నామని చెప్పినట్లవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 55 శాతం కర్బన ఉద్గారాలకు కారణమయ్యే కనీసం 55 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేసినప్పుడే ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది. ఇప్పటివరకు 61 దేశాలు ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేసి అందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసినప్పటికీ మొత్తం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో అది 47.79 శాతమే అవుతోంది. భారత్ ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లయితే అది 51.89 శాతానికి చేరుకుంటుంది. ఐరోపా యూనియన్ కూడా ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్లయితే అది 61 శాతానికి చేరుకుంటుందని దవే చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 12న 185 దేశాలు కలిసి పారిస్ ఒప్పందాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.