జాతీయ వార్తలు

నష్టం 2,202 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,అక్టోబరు 2: తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి ఉదారంగా సాయం చేయాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల రూ.2,202కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక నివేదికను కేంద్రానికి అందజేసింది. త్వరలోనే కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన సహాయం అందిస్తామని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఆదివారం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మలు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి నివేదికను సమర్పించారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సెప్టెంబరు 21 నుంచి 26 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 197 శాతం అధిక వర్షపాతం నమోదయిందన్నారు. ఈ వర్షాల మూలంగా రాష్టవ్య్రాప్తంగా రూ.2,202కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా నివేదికను హోంమంత్రికి అందజేశామని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ వర్షాల వల్ల రూ.1157 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా లక్షా ఇరవై వేల హెక్టార్ల పంట నష్టం జరిగిందని, దాదాపు 19,435 ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ వర్షాలవల్ల సోయా పంటకు అధికంగా నష్టం వాటిల్లిందని, దాదాపు రూ.97 కోట్ల విలువైన పంట నష్ట జరిగిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్లకు రూ. 463కోట్లు, పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్లకు రూ. 298 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. మిడ్ మానేరుతో సహా తెలంగాణవ్యాప్తంగా 671 చెరువులకు గండ్లు పడ్డాయని, అలాగే ఈ వర్షాల వల్ల 46 మంది మృతి చెందారని మంత్రి రాజేందర్ తెలిపారు.
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ వరదల వల్ల నష్ట పోయిన రైతులను అన్ని విధాలుగా అదుకుంటామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లో 1908 తరువాత ఇంత భారీ స్థాయిలో వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదన్నారు. రాజధాని ప్రాంతంలో వర్షాల వల్ల అనేకచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర హోంమంత్రిని కలిసి ప్రాథమిక నివేదికను అందజేశామని, దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బృందాలను తెలంగాణకు పంపి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తగిన సహాయం అందిస్తామని రాజ్‌నాధ్ సింగ్ హామీ ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
కాగా,తెలంగాణ భవన్‌లో జరిగిన 147 వ గాంధీ జయంతి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఎండి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మలు పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
chitram...
హైదరాబాద్‌లో ఆదివారం కొన్ని ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షం