జాతీయ వార్తలు

ఉగ్రవాదానికి తోడ్పాటు ఇవ్వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: సీమాంతర ఉగ్రవాదానికి తమ భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలని సార్క్ సభ్య దేశాలను నేపాల్ కోరింది. 19వ సార్క్ శిఖరాగ్ర సమావేశం వాయిదా పడినట్లు ఆదివారం ప్రకటించిన సందర్భంగా ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో నేపాల్ ఈ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతానికి 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సు జరగడానికి దక్షిణాసియా వాతావరణం అనుకూలంగా లేకపోవడం పట్ల ఆ దేశం విచారం వ్యక్తం చేసింది. సార్క్ శిఖరాగ్ర సమావేశం నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. అయితే శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంపై నేపాల్ సార్క్ సభ్య దేశాలతో అవసరమైన చర్చలు జరుపుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఉరి ఉగ్రవాద దాడి, అనంతరం నియంత్రణ రేఖపై ఉగ్రవాద శిబిరాలను తుడిచిపెట్టడానికి భారత సైన్యం లక్షిత దాడులు జరపడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో సార్క్ సదస్సును వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన రెండు రోజులకే నేపాల్ ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సదస్సు వాయిదా పడినట్లు ప్రకటించడం గమనార్హం.
అన్ని రకాల ఉగ్రవాదాలను ఆ ప్రకటన ఖండిస్తూ, 19 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఉరి ఉగ్రవాద దాడిని ఖండించడమే కాక భారత్‌కు సంఘీభావం తెలియజేసింది. కాగా, సార్క్ సదస్సు నిర్వహించడానికి అనువైన వాతావరణాన్ని కల్పించనందుకు పాకిస్తాన్‌ను పరోక్షంగా నిందిస్తూ భారత్, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక దేశాలు ఇదివరకే సార్క్ సదస్సుకు హాజరు కాలేమని ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోందని నిందిస్తూ భారత్ అన్ని దేశాలకన్నా ముందుగా సార్క్ సదస్సుకు హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. సార్క్ నిబంధనావళి ప్రకారం అన్ని స్థాయిలలోను నిర్ణయాలను ఏకాభిప్రాయం ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది. సభ్య దేశాల ప్రభుత్వాధినేతల సమావేశాలు ఏర్పాటు చేయడానికి సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది.