బిజినెస్

భవిష్యత్తు భారత్‌దే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ఆర్థికాభివృద్ధిలో పురోగమిస్తున్న భారత్‌కు మున్ముందు మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఖాయమని, రానున్న 25 ఏళ్లు భారత్‌వేనని ప్రముఖ పారిశ్రామికవేత్త, హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్), భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారత ఆర్థిక శిఖరాగ్ర సదస్సు (ఇండియా ఎకనమిక్ సమ్మిట్)లో గురువారం ఆయన ప్రసంగిస్తూ, దేశంలో పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల అభివృద్ధికి కార్మిక, భూసంస్కరణు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ఈ రెండు రంగాలు అస్థిరంగా ఉన్నాయి. పరిశ్రమ విస్తరణ కోసం భూమిని పొందడం చాలా కష్టమవుతోంది. అలాగే ఉత్పత్తి రంగాన్ని విస్తరించాలంటే కార్మికుల సంఖ్యను, సామర్ధ్యాన్ని పెంపొందించుకుని తీరాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు ఎంతో ముఖ్యమనవి. సంస్కరణలతోనే ఈ సమస్యలు పరిష్కారమవుతాయి’ అని పవన్ ముంజాల్ పేర్కొన్నారు. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని, ఈ చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ సానుకూల దిశలో పురోగమిస్తోందని ఆయన కొనియాడారు.