ఆంధ్రప్రదేశ్‌

శాంతియుతంగానే ఉద్యమం : ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, అక్టోబర్ 6: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో త్వరలో శాంతియుత ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీయిచ్చిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక కరివేపాకులా తీసిపారేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జెఎసి సమావేశంలో పాల్గొని, రోడ్డు మార్గాన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి వెళుతూ మార్గమధ్యంలో మండపేటలో విలేఖర్లతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్వహించిన జెఎసి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించామన్నారు. చిరంజీవి, దాసరి, మాజీ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో పాటు కాపు ప్రముఖులందరితో చర్చించినట్టు తెలిపారు. ముందుగా గ్రామస్థాయి, తదనంతరం మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్టస్థ్రాయిలలో కాపు కమిటీలను నియమిస్తామన్నారు. సంస్థాగతంగా కాపు జెఎసిని బలోపేతం చేయడం తమ కర్తవ్యమన్నారు.