కర్నూల్

రోడ్డెక్కిన శెనగ రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు,మిడుతూరు, అక్టోబర్ 7: సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ చేసేందుకు బయోటెక్ విదానం ఉపయోగించడం వల్ల సర్వర్లు పని చేయక పోవడంతో శనగ విత్తనాల పంపిణీ నిలిచిపోవడంతో రైతులు కెజి రోడ్డుపై బైటాయించారు. శుక్రవారం ఉదయం నుంచి సర్వర్లు పనిచేయక పోవడంతో రైతులు కార్యాలయాల వద్ద పడిగాపులు కాసి విసుగు చెంది నందికొట్కూరులోని మార్కెట్ యార్డు వద్ద కెజి రోడ్డుపై బైటాయించి ఆందోలన చేపట్టారు. దీంతో కెజి రహదారి వాహనాల
రాకపోకలు నిలిచిపోయాయి. విత్తనాలు పంపిణీ చేసే వరకు ఆందోలన విరమించేది లేదని రైతులు చెప్పడంతో పోలీసులు, రైతుల మద్య వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వ్యవసాయ అధికారులు వచ్చి సమాదానం చెప్పే వరకు ఆందోలన విరమించేది లేదన్నారు. చివరకు వ్యవసాయ అధికారి వీరారెడ్డి వచ్చి సర్వర్లు పనిచేయక పోవడం వల్లే విత్తనాలు ఇవ్వలేక పోయామని ఎంత ఆలస్యమైనా రైతులందరికి విత్తనాలు పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోలన విరమించారు. అలాగా మిడుతూరు మండల కేంద్రంలో కూడా సర్వర్లు పని చేయక పోవడంతో రైతులు సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. వ్యవసాయ అధికారి కృష్ణారెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు కాతా రమేష్ రెడ్డి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్లారు. రేపటి నుండి అధనంగా గ్రోమర్ కేంద్రంలో రెండు ట్యాబ్‌లను ఏర్పాటు చేసి రైతులకు త్వరితగతిన శనగలు పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.