రాష్ట్రీయం

సదావర్తి భూములపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: అమరావతిలో సదావర్తి భూముల వేలం విక్రయంలో కొనుగోలుదారులకు విక్రయ ధృవపత్రాన్ని జారీ చేయరాదని, వచ్చే రెండు వారాల్లోగా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నైలో ఉన్న అమరావతి శ్రీసదావర్తి సత్రానికి చెందిన భూముల విక్రయానికి సంబంధించి హైకోర్టు పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. దేవాదాయ శాఖ ఈ భూములను విక్రయించడం అక్రమమని ప్రకటించాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఆంధ్ర చారిటబుల్ హిందూ దేవాదాయ చట్టం 1987కు విరుద్ధంగా ప్రభుత్వం సదావర్తి భూములను విక్రయించిందని పేర్కొన్నారు. మార్కెట్‌లో ఈ భూములకు సంబంధించి ఎకరం విలువ రూ.7 కోట్లుంటే, రూ.26 లక్షలకే విక్రయించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ పేర్కొన్న రేటు చెల్లించి ఆ భూములను కొనుగోలు చేస్తామని కొనుగోలు దారులు ఎవరైనా ముందుకు వస్తే మళ్లీ వేలం నిర్వహించేందుకు అభ్యంతరం లేదని హైకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ న్యాయవాది పి సుధాకర్ రెడ్డి ఏజి ప్రస్తావించిన అంశాలపై అభిప్రాయం తెలియచేయాలని హైకోర్టు కోరింది. సమయం కావాలని న్యాయవాదికోరారు. అనంతరం ఈ భూములను కొనుగోలు చేసిన వారికి విక్రయం చేసినట్లు ధ్రువపత్రాలు ఇవ్వరాదని, ప్రభుత్వం రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేయాలని హైకోర్టు ఆదేశించింది.