ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్‌ను అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: ఆంధ్ర రాష్ట్రంలో ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్‌ను అమలు చేస్తామని, విద్యుత్ పొదుపునకుకు ఎల్‌ఇడి బల్బులను అమర్చడం ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బుధవారం అమరావతిలో ఇండో స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాజెక్టు (బిఇఇపి) కార్యక్రమంలో భాగంగా ఇంధన సామర్థ్యం, ప్రజాభవనాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెయ్యి చదరపు మీటర్ల ప్లాటు, 2000 చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాలో ఏది ఎక్కువ ఉంటే ఆ స్థలంలో జరిగే భవన నిర్మాణాల్లో ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్‌ను అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు,చట్టాన్ని రూపొందించామన్నారు. బహుళ అంతస్తుల భవనాలు, ఆసుపత్రులు, హోటళ్లు, కనె్వన్షన్ సెంటర్లలో ఆంధ్రప్రదేశ్ ఇసిబిసిని తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ, స్విట్జర్లాండ్ ఫెడరేషన్ డిపార్టుమెంట్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఆధ్వర్యంలో ఇండో స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రొగ్రాంను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కోటి మంది విద్యుత్ వినియోగదారులకు రెండుకోట్ల ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేశామని, 5.5 లక్షల ఎల్‌ఇడి వీధి దీపాలను అమర్చామన్నారు. విద్యుత్ ఆదా కోసం ఐదు స్టార్ రేటింగ్ ఉన్న రెండు లక్షల ఫ్యాన్లు, పంపుసెట్లను అమర్చామన్నారు. వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం తగ్గాలంటే విద్యుత్ ఆదా తప్పనిసరి అన్నారు. కొత్తగా నిర్మించే వాణిజ్య భవనాలు విద్యుత్ ఆదా పథకంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్విట్జర్లాండ్‌కు చెందిన విద్యుత్ నిపుణులు పాల్గొన్నారు.