ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ (నర్సరీ- ఎల్‌కెజి, యుకెజి ) తరగతులు ప్రారంభించాల్సిందిగా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ చైర్మన్, పంజాబ్ విద్యాశాఖా మంత్రి డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా తన నివేదికలో స్పష్టం చేశారు. 189 పేజీల నివేదికను డాక్టర్ చీమా కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి అందజేశారు. డాక్టర్ చీమా వెంట కమిటీ మెంబర్ సెక్రటరీ మనీష్‌గార్గ్ , నూపా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జెబిజి తిలక్ కూడా ఉన్నారు. సబ్ కమిటీ నివేదికపై ఈ నెల 25వ తేదీన జరిగే సిఎబిఇ సమావేశంలో నిర్ణయించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించడం వల్ల విద్యాప్రమాణాలు బాగా మెరుగుపడతాయని కమిటీ సూచించింది. 8వ తరగతి వరకూ డిటెన్షన్ విధానం కొనసాగించరాదని కూడా కమిటీ పేర్కొంది. ఐదో తరగతి లోనూ, ఎనిమిదో తరగతిలోనూ విద్యార్ధి విద్యాప్రమాణాలను సమీక్షించేందుకు వారి స్థాయిత్వాన్ని అంచనా వేయాలే తప్ప వారి ప్రగతి ఆధారంగా డిటెన్షన్ అమలుచేయరాదని కూడా కమిటీ పేర్కొంది. వివిధ దేశాల్లో విద్యారంగంపై పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నారని, భారత్‌లో కూడా స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసం ఆరు శాతం నిధులను వెచ్చించాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ప్రతి పాఠశాలకు హెడ్మాస్టర్, హెడ్ టీచర్ లేదా ప్రిన్సిపాల్ నియామకాన్ని నిర్బందం చేయాలని కూడా కమిటీ సూచించింది. అపుడే పాఠశాలలకు జవాబుదారీతనం వస్తుందని పేర్కొంది. పదోన్నతులు లేదా ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్ నిరంతరం నిర్వహించడం ద్వారా పాఠశాలల్లో ఖాళీలు లేకుండా చూడవచ్చని, తద్వారా పాఠశాల పరిపాలన సవ్యంగా జరుగుతుందని కూడా కమిటీ అభిప్రాయపడింది. విద్యాత్మక నిపుణులతో కూడిన కమిటీని నియమించడం ద్వారా ఎప్పటికపుడు సిలబస్, విద్యాపాలన నిరంతర మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే టీచర్ ట్రైనీలకు అవసరమైన సంపూర్ణ శిక్షణ కూడా ఎప్పటికపుడు అందించాలని, అలాగే ఉపాధ్యాయుల శిక్షణ బాధ్యత కేవలం రాష్ట్రాలకే పరిమితం చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పగించాలని, ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు అనుబంధం చేయాలని కమిటీ తమ నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వౌలిక సదుపాయాలు, సొంత భవనాలు, ఆటస్థలాలు, ప్రాధమిక సౌకర్యాలు, కంప్యూటర్ ఆధారిత విద్య , రవాణా సదుపాయాలు కల్పించాలని, సమీపంలోని పరిశ్రమల్లో పనిచేసే వారి కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రత్యేక సహకారం ఉండాలని కూడా సూచించింది. ప్రతి పాఠశాలను నిరంతరం మూల్యాంకనం చేసి దాని స్థాయిత్వాన్ని భవిష్యత్ లక్ష్యాల సాధనలో ఆ పాఠశాల స్థితిగతులను అంచనా వేయాలని పేర్కొంది.