రాష్ట్రీయం

ఇక తిరుమలలో బ్యాటరీ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 20: తిరుమలలో పర్యావరణ హితమైన బ్యాటరీ బస్సులు నడపాలని నిర్ణయించినట్టు టిటిడి ఇఓ సాంబశివరావు చెప్పారు.ప్రయోగాత్మకంగా త్వరలో రెండు బ్యాటరీ బస్సులను నడపనున్నట్లు ఆయన వివరించారు. టిటిడి రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆయుధ పూజ జరిగింది. ఈసందర్భంగా ఇఓ మాట్లాడుతూ తిరుమలలోని ధర్మరథాలు భక్తులకు వివిధ ప్రాంతాలకు ఉచితంగా చేరవేసేందుకు సహకరిస్తున్నట్లు వివరించారు. డ్రైవర్లు తమ నైపుణ్యం, అనుభవంతో తిరుమల ఘాట్‌రోడ్డును ప్రమాదరహితంగా మార్చి అందరి మన్ననలు అందుకుంటున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమలలో బ్యాటరీ కార్లు, వృద్ధులకు, వికలాంగులకు చాలా ఉపయోగకరంగా నడుపుతున్నట్లు తెలిపారు. అదే తరహాలో బ్యాటరీ బస్సులను నడపాలని నిర్ణయించినట్టు ఆయన వివరించారు.