ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 20: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు అవకాశం ఇస్తామని, వారికి కంటెంట్‌ను అందచేస్తామన్నారు. నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో, కళాశాలల్లో ఉచితంగా వైఫై సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 1212 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్‌లో లాంఛనంగా ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 41834 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అమెరికా నుంచి అక్కడి టీచర్లు చెప్పే పాఠాలు వినే సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివి అమెరికాలో విజయం సాధించిన వారు తమ అనుభవాలను చెప్పేందుకు అవకాశం డిజిటల్ క్లాస్ రూమ్‌ల ద్వారా లభిస్తుందన్నారు. ఒక నెల రోజుల్లో వర్సిటీలు, కళాశాలల్లో ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. చదివే విధానంలో కూడా మార్పులు వచ్చాయని, నేర్చుకునే వాళ్లకు ఆకాశమే హద్దుగా అవకాశాలు కల్పిస్తామన్నారు. నాలెడ్జ్ స్టేట్‌గా, హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. టీచర్లకు ట్యాబ్‌లు ఇస్తామని, ఆధునిక సాంకేతిక పరిజానంతో బోధించకపోతే విద్యార్థుల కంటే వెనుకబడిపోతారన్నారు. వివిధ సబ్జెక్ట్‌లకు సంబంధించి నిపుణులతో లైవ్‌లో పాఠాలు బోధించేందుకు వీలుగా నిపుణులను ఎన్యుమరేట్ చేయనున్నామన్నారు. ప్రతి పాఠశాలలోనూ ఇన్నోవేషన్ చాప్టర్లను ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో ఆ ఆలోచనలను పరిశీలించి, ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ల ద్వారా ఆడియో, విజువల్ రెండూ ఉండటం వల్ల విద్యార్థులే సొంతంగా నేర్చుకునే వీలు ఉంటుందని, మరింతగా జాపకం ఉంటుందన్నారు. తల్లితండ్రులు ఆస్తి ఎంత ఇచ్చారన్న దాని కన్నా, ఎంతవరకూ చదివించారన్నది ముఖ్యమన్నారు. డబ్బు కన్నా ఆలోచనలు ముఖ్యమని, డబ్బు సమస్య కాదన్నారు. జన్మభూమి కార్యక్రమం కింద డిజిటల్ క్లాస్‌రూమ్‌లకు సహాయం అందిస్తున్న ప్రవాసాంధ్రులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, ఎంపి కె.హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నార్త్ అమెరికా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జయరాం కోమటి, పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు 4.5 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందచేశారు. తెలుగు పలుకు అన్న మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు.
ప్రజల్లో చైతన్యంతోనే స్వచ్ఛ్భారత్
ప్రజలు అందరిలోని చైతన్యంతోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, 2019నాటికి మలవిసర్జన రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖలో గురువారం ఆంధ్రవిశ్వవిద్యాలయం వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన స్వచ్ఛ్భారత్‌తో స్క్రీనింగ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ అందరి కార్యక్రమమని, ప్రతిఒక్కరిలోనూ మార్పు రావడంతోనే ఇది సులభతరమవుతుందన్నారు. ప్రపంచస్థాయి టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రంలో చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా 11 ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని, దీనిలోభాగంగానే విశాఖలో ఒకటి ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లో 1500 గ్రామాల్లో మలవిసర్జన రహిత నగరాలుగా తీర్చిదిద్దామన్నారు. గ్రామస్థాయిలో పారిశుద్ధ్య నివారణకు అధిక ప్రాధాన్యతనిచ్చి గ్రామస్థాయి నుంచి వర్మీ కంపోస్టులను ఏర్పాటు చేసి ఆదాయం వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. దీని కోసమే ప్రతి శనివారం మధ్యాహ్నం నుంచి అన్నిశాఖల ఉద్యోగులతోపాటు ప్రజలు విద్యార్థులు, సంయుక్తంగా స్వచ్ఛాంద్రప్రదేశ్, స్వచ్ఛ్భారత్ వనం-మనం నీటి సంరక్షణ కార్యక్రమాలపై చర్చలు, అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెలలో ప్రతి నాలుగో శనివారం అన్ని శాఖల ఉద్యోగులు కేవలం స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకే ప్రణాళికలను రూపొందించామన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు రాష్టవ్య్రాప్తంగా అన్ని పాఠశాలలో స్వచ్ఛ్భారత్‌పై రూపొందించిన షార్ట్ఫిల్మ్‌లను ప్రదర్శించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గాంధీజీ స్ఫూర్తితో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడకుండా ప్రజా ఉద్యమంగా చేపట్టాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తూ సింగ్‌పూర్ తరహాలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతున్నామన్నారు.

చిత్రం..డిజిటల్ తరగతులను రిమోట్ ద్వారా ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు