క్రీడాభూమి

నాలుగు దేశాల జూనియర్ హాకీ రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలెన్షియా, అక్టోబర్ 27: ఇక్కడ జరుగుతున్న నాలుగు దేశాల జూనియర్ ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు తన రెండో మ్యాచ్‌ని చేజార్చుకుంది. మొదటి మ్యాచ్‌లో బలమైన జర్మనీని 3-1 తేడాతో ఓడించిన భారత యువ జట్టు రెండో మ్యాచ్‌లో బెల్జియం చేతిలో పరాజయాన్ని చవిచూసింది. భారత్ రెండు గోల్స్ చేయగా, బెల్జియం నాలుగు గోల్స్ సాధించి విజయభేరి మోగించింది. మ్యాచ్ మొదటి నిమిషంలోనే విక్టర్ వెగ్నెజ్ ద్వారా బెల్జియం ఖాతా తెరిచింది. నాలుగో నిమిషంలోనే భారత్‌కు ఈక్వెలైజర్ చేసే అవకాశం లభించింది. కానీ, ఆ అవకాశాన్ని బెల్జియం గోల్‌కీపర్ లోయిక్ వాన్ డోరెన్ సమర్థంగా అడ్డుకున్నాడు. 11వ నిమిషంలో భారత్‌కు రెండో పెనాల్టీ లభించింది. దీనిని హర్మన్‌ప్రీత్ సింగ్ సద్వినియోగం చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. మ్యాచ్ ప్రధమార్ధం ఇదే స్కోరుతో ముగిసింది. అయితే, ద్వితీయార్ధంలో బెల్జియం ఆటగాళ్లు ముమ్మర దాడులు చేశారు. ఫాబ్రిస్ వాన్ బొక్రిక్ 49వ నిమిషంలో, ఆంటోన్ కినా 56వ నిమిషంలో, గ్రెగరీ స్టోక్‌బొక్స్ 57వ నిమిషంలో గోల్స్ సాధించడంతో బెల్జియం ఖాతాలో మొత్తం నాలుగు గోల్స్ చేరాయి. చివరి క్షణాల్లో భారత ఆటగాడు అజయ్ యాదవ్ చక్కటి ఫీల్డ్ గోల్ చేసి, బెల్జియం ఆధిక్యాన్ని తగ్గించగలిగాడుగానీ, జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.