తెలంగాణ
ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టిన పల్లా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 October 2016
హైదరాబాద్, అక్టోబర్ 28: శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విప్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డిని మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, అభినందనలు తెలిపారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అభినందించారు. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత పల్లా రాజేశ్వర్‌రెడ్డి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు.