అంతర్జాతీయం

‘ఆప్తమిత్రుడి’కోసం ఒబామా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 29: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మిత్రుడైన ప్రవాస భారతీయుడికోసం అత్యంత అరుదుగా టీవీ యాడ్‌లో దర్శనమిచ్చారు.
చికాగో శివార్లలోని ఇల్లినాయిస్ జిల్లానుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీచేస్తున్న తన ‘ఆప్తమిత్రుడు’ రాజా కృష్ణమూర్తిని గెలిపించాలని ఒబామా ఈ యాడ్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘హాయ్, నేను బరాక్ ఒబామాను. పార్లమెంట్ సభ్యుడిగా పోటీచేస్తున్న నా మిత్రుడు కృష్ణమూర్తికి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని ఆయన 30 సెకన్ల నిడివి గల ఈ స్వల్ప వీడియో యాడ్‌లో పేర్కొన్నారు. కృష్ణమూర్తి తనకు ‘మంచి మిత్రుడు’ అని, అమెరికా ఆర్థిక వ్యవస్థను అందరికీ సంక్షేమకరమైనదిగా తీర్చిదిద్దడం ఎలా? అని ఆలోచిస్తున్న తనకు కృష్ణమూర్తి ఎంతో విలువైన సలహాలు, సూచనలు అందించారని ఒబామా ఈ యాడ్‌ద్వారా ప్రజలకు వివరించారు.