మెయిన్ ఫీచర్

సహజీవనం స్వేచ్ఛకు నిదర్శనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెలబ్రిటీలు ఏది చేసినా సంచలనమే. వారి పెంపుడు కుక్కకు దెబ్బ తగిలినా సోషల్ మీడియా విలవిలలాడిపోతుంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో సినీనటి గౌతమి తన సహచరుడు కమల్‌హాసన్‌తో ఉన్న 13 ఏళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్లు, ఈ మాటను మీతో చెప్పటానికి తన మనసు ముక్కలైందన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించటంతో మరోసారి సహజీవనంపై సరికొత్త చర్చకు తెరలేచింది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని ఇలాంటి సెలబ్రిటీలు విడిపోతే జరిగే నష్టం వారికేమి ఉండదు. కాని ఇబ్బందల్లా ఇలాంటివారిని అనుసరిస్తూ సామాన్యులు, ఆధునిక యువత ఈ సహజీవనం వైపు మొగ్గుచూపుతుండటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి.
నేటి ఆధునిక సమాజంలో సహజీవనం అనేది సర్వసాధారణమైన అంశంగా మారిపోయింది. ఆడ, మగ పరస్పర సానుకూల అభిప్రాయాలతో కలిసి ఉండటానికి ఇష్డపడటాన్ని న్యాయస్థానాలు సైతం తప్పుపట్టడం లేదు. కాని సహజీవనం వల్ల తలెత్తే సమస్యల వల్ల మహిళలు బాధితులుగా మిగులుతున్నారనేది కాదనలేని సత్యం. సహజీవనంలో సహచరుడు నుం చి వేధింపులు, హింస ఎదుర్కొంటే ఆమెకు గృహ హింస చట్టం కింద న్యాయం అందించాలని అత్యున్నత న్యాయస్థానమే సెలవిచ్చింది. ఈ సహజీవనం చట్టబద్దమైన బంధంగా పరిగణించేలా చట్టం తీసుకురావాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి సూచన కూడా చేసింది.
రేప్ కేసులుగా నమోదు..
వివాహబంధం అనేది ఆర్థిక బంధంగా మారిపోవటంతో పట్టణ ప్రాంతాల్లోని యువత సహజీవనం వైపునకు అడుగులు వేస్తోంది. చదువుల కోసం, ఉద్యోగాల కోసం పట్టణాలకు వచ్చే యువతీ యువకులు ఈ సహజీవనానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా యువకులు పెళ్లికి ముందు సెక్స్ అనేది తప్పు కాదు అని భావిస్తూ సహజీవనానికి మొగ్గుచూపుతున్నారు. యాభైఒక్కశాతం మంది యువకులు ఇలాంటి మార్గం వైపు రావటానికి ఇష్టపడుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. శారీరక బంధం తో కలిసి జీవించాలనుకునే ఇలాంటి యువతీ యువకులు తరువాత ఆ బంధాన్ని తెగతెంపులు చేసుకునే సందర్భంలో రేప్ కేసులుగా నమోదుచేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నమోదవుతున్న కేసుల లో దాదాపు 25శాతం వరకు ఇలాం టి బాపతే. శారీరక బంధంతో కలిసి జీవిస్తూ పెళ్లి చేసుకోవటం లేదని యువతులు పోలీసులను ఆశ్రయస్తున్నారు. ఢిల్లోలో 1,656 రేప్ కేసులు నమోదుకాగా వీటిలో 419 కేసులు సహజీవనం చేస్తూ విడిపోయినవారు పెట్టుకున్నవేనని తేలింది.
బలహీనతగా భావిస్తున్న పెద్దలు
సహజీవనాన్ని మన సమాజం ఎంతమాత్రం ఆమోదించటం లేదు. అత్యధిక శాతం మంది పెద్దలలో తిరస్కృతి భావం ఉంది. 80శాతం మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు సహజీవనం చేస్తామంటే అంగీకరించకపోగా.. దీన్ని బలహీనతగా భావించి బాధపడుతున్నారు. బలహీనతలను అధిగమించి శాశ్వత బంధమైన వివాహబంధంలోనే యువతీయువకులు ఇమిడిపోతే తరువాతి తరం ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుందన్న పెద్దల సుద్దులలో వాస్తవం లేకపోలేదు. వివాహం పట్ల పరస్పరం నమ్మకం, గౌరవభావం ఉంటే ఎలాంటి భేదాభిప్రాయాలు వచ్చినా విడిపోకుండా ఆ బంధాన్ని గౌరవిస్తూ జీవిస్తారు. కాని సమాజంలో అభద్రతకు లోనైన ఒంటరి మహిళలు, కట్నకానుకలు, పెళ్లి ఖర్చులు, లాంచనాలు వంటివాటిని వ్యతిరేకించే ఆధునిక యువతులు సహజీవనం వైపునకు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి వారు 36శాతం మంది ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఏ బంధమైతే తమకు అండగా నిలబడుతుందని భావిస్తారో అదే వారి బలహీనతగా మారి విడిపోవటానికి కారణమవుతోంది. ఎందుకంటే 45శాతం మంది యువకులు తన సహచరిణి కన్యగానే ఉండాలని కోరుకుంటున్నారు.
అటువంటప్పుడు డేటింగ్ పేరుతో యువకులు తమకు నచ్చిన యువతులతో కలిసి ఒకే ఇంట్లో కొంతకాలం మాత్రమే ఉంటున్నారు. ఆ తరువాత చిన్నచిన్న కారణాలతో విడిపోతున్నారు. ఇలా అనునిత్యం అపనమ్మకాలతోనూ, ఆర్థిక లాభాపేక్షతోనూ,ఆధిపత్య ధోరణిలతో ఒకే కప్పుకింద జీ వించాలనుకునేవారిలో గొడవలు, కీచులాటలు, అభిప్రాయభేదాలు ఎన్నో వస్తాయి. అవి ఒక్కొక్కసారి విషాదాన్ని మిగులుస్తున్నాయి. దీనికి ఉదాహరణ చిన్నారి పెళ్లికూతురు ప్ర త్యూష బలవన్మరణం.
ఏది ఏమైనప్పటి కీ ఒక వ్యక్తితో కలిసి జీవిస్తున్నామంటే పరస్పర సహకారం, ధైర్యం, తోడు, సర్దుబాటుతత్వం ఉండాలి. అలాలేనినాడు అదివివాహబంధమైనా, సహజీవన బంధమైనా గౌరవాన్ని, అపనమ్మకాన్ని కోల్పోయి తాత్కాలిక బంధాలకు తెరతీసినట్లవుతుంది.

- ఆశాలత