జాతీయ వార్తలు

జయ ఆస్తుల కేసులో సుప్రీంలో కర్నాటక సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడిఎంకె అధినేత్రి జయలలితను నిర్దోషిగా హైకోర్టు తీర్పును కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మే 11న జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె ఇద్దరు బంధువులు విఎన్ సుధాకరన్, ఎలవారసిలను హైకోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చింది. అయితే జయ ఆదాయాల మదింపు విషయంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు తీర్పుల మధ్య వ్యత్యాసం ఉందని కర్నాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. జోసెఫ్ అరిస్టాటిల్ కర్నాటక ప్రభుత్వం తరఫున సుప్రీంలో పిటిషన్ వేశారు. జయ ఆస్తుల లెక్కింపులో పొరపాట్లు దొర్లాయని పిటిషన్‌లో ఆరోపించారు. 18 ఏళ్లు సాగిన జయలలిత అక్రమ ఆస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా తీర్పునిచ్చింది. జయతోపాటు శశికళ మరో ఇద్దరికి నాలుగేళ్లపాటు జైలు శిక్ష, జయకు వందకోట్ల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కర్నాటక హైకోర్టులో వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భవానీ సింగ్‌ను నియమించే హక్కు తమిళనాడు ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.