నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవదభ్యర్చన వేళలన్ భవుల సంప్రద్భాంతులన్ దీన మా
నవులన్ విద్విషులన్ భవాతురుల సన్మానించుటల్ సౌఖ్యము
ఖ్య విహారేచ్ఛలు నీ మహత్త్వములు నిత్యానంద మూహించుచో
భువి నీ భక్తుల కాత్మలో విరసముల్పుటిటంచు సర్వేశ్వరా!

భావము:సర్వేశ్వరా! నీ మహత్వాలని నిత్యానందాన్ని భావించినట్లయితే, నీ పూజ చేస్తూనే శివభక్తులు కానివాళ్ళ ఐశ్వర్యభ్రమలను, భక్తిహీనులను, ద్వేషపరులను, సంసారాసక్తులను గౌరవించడం సుఖప్రాప్తికై విహారేచ్ఛ నీ భక్తులకు మనస్సులో విరసాన్ని పుట్టిస్తాయి. అంటే అచ్చమైన శివభక్తుడు శివమహాత్మ్యాన్ని, శివానందాన్నీ మాత్రమే కోరుకుంటాడు. శివ భక్తుడు అయతే చాలు తుచ్ఛమైన కోరికలన్నీ వాటికవే నశించిపోతాయ. ఒకవేళ భక్తుని దగ్గర భౌతికమైన సంపదలు ఏమీ లేకపోయనా సరే. మానసికంగా అవి ఉన్నట్టు గానే భావిస్తాడు. తానే భగవంతుని కోసం దేవాలయాన్ని నిర్మించానని అందులో శివప్రతిష్ఠ చేసానని, ఆ శివునికి ఎన్నో ఆభరణాలను పెట్టానని ఎన్నోరకాలైన నైవేద్యాలు అందిస్తున్నానని ఇలా ఎన్నో విధాలుగా మానసిక పూజచేసి నిర్మలమైన ఆనందానే్న పొందుతాడు.

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ