Others

నాకు నచ్చిన చిత్రం-- కులగోత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1962లో విడుదలై ఎనిమిది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న సాంఘిక చిత్రం ‘కులగోత్రాలు’. కథాంశం పాతదే అయినా ఇతర హంగులతో అలనాటి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన చిత్రమిది. ముఖ్య పాత్రలలో నాగేశ్వరరావు, కృష్ణకుమారి జీవించారనే చెప్పాలి. శుద్ధ్ఛాందస వాది అయిన భూషయ్య ఏదో ఒక లోటు కారణంగా తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి అంగీకరించకపోయినా, ఆయన అనుమతితోనే శుభకార్యం ముగుస్తుంది. ఇతర పాత్రలలో జి వరలక్ష్మి, గిరిజ, రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రం నవ్వులనూ పండించింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అనే పాటే ఇందుకు నిదర్శనం! ‘రావే రావే బాలా’ అన్న పాట పిబి శ్రీనివాస్ జమునారాణిగార్ల గాత్రంలో ఆనాటి యువతను ఎంతగానో అలరించింది. అన్నిటికన్నా చెప్పుకోదగిన పాట ‘చేతిలో డబ్బులుపోయెనే, జేబులు ఖాళీ ఆయెనే’ ఈ పాటను పిఠాపురం, మాధవపెద్ది సత్యంగార్ల బృందం హాస్యరసానికి తగినట్టు పాడి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఈ పాటను కొసరాజు రాఘవయ్య సందర్భోచితంగా రచించారు. అప్పట్లో సినిమా పెట్టెతోపాటు పాటల పుస్తకాలూ థియేటర్లకు వచ్చేవి. ఇంటర్వెల్‌లో ప్రేక్షకులు అవి కొనుక్కొని ఇంటికెళ్లేవారు. ముఖ్యంగా కులగోత్రాలు పూర్తి స్క్రిప్టును రావికొండలరావు వెండితెర నవలగా డెబ్బై అయిదు పైసలకే అందించారు. హాట్‌కేక్‌లాగ అమ్ముడైపోవడంతో పునర్ముద్రణ జరిగింది. అప్పుడే రంగంలో నిలదొక్కుకుంటున్న కృష్ణ ఈ చిత్రంలో ఒక సీనులో పెండ్లికొడుకుగా మనకు కనిపిస్తారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ భాషాచిత్రంగా ఎన్నికైన ‘కులగోత్రాలు’ సర్వప్రేక్షక జనామోదం పొందింది. ఈ చిత్రం అంటే నాకే చాలా ఇష్టం.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం