జాతీయ వార్తలు

నకిలీ డిగ్రీల గురించి నాకు తెలియదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ తప్పుడు డిగ్రీలకు సంబంధించి తనకు ముందస్తుగా సమాచారం లేదని, అవి బూటకపు డిగ్రీలన్న సంగతే తనకు తెలియదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశంలో తోమర్ డిగ్రీల వ్యవహారం దుమారం రేపిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బిజెపి సభ్యులు ఈ అంశంపై అసెంబ్లీలో రాద్దాంతం సృష్టించారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన కేజ్రీవాల్ ‘మీడియాలో వచ్చిన కథనాలు నిజమైతే.. తోమర్ నకిలీ డిగ్రీల గురించి నాకేమీ తెలియనట్టే లెక్క. దీన్నిబట్టి నాకు తప్పుడు డిగ్రీలను ఆయన చూపించినట్టు స్పష్టమవుతుంది’ అని కేజ్రీవాల్ అన్నారు. ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోందని తోమర్ తప్పుచేసినట్టు తేలితే ఆయనకు తగిన శిక్ష విధిస్తామని ఆయన వెల్లడించారు. ఎవరు ఎలాంటి తప్పుచేసినా తాను సహించేదిలేదని, మంత్రులైనా వారి బంధువులైనా ఈ విషయంలో రాజీపడేది లేదని అందుకే విచారణలో ఏ విషయం తేలకుండానే తోమర్ రాజీనామాను ఆమోదించినట్టు కేజ్రీవాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపైనా బిజెపి నేతలు తీరుపైనా ఆయన ధ్వజమెత్తారు. ఐపిఎల్ మాజీ బాస్ లలిత్‌మోడీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సిఎం వసుంధర రాజెపై వచ్చిన ఆరోపణలపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.