ఉత్తర తెలంగాణ

మార్చు నీ ప్రపంచాన్ని! ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశపు నీలం
పసిదాని పట్టుపావడా అయ్యింది
విరబోసుకున్న నల్లని కురుల అంతరిక్షంలో
మిలమిలా మెరిసే కన్నుల నక్షత్రాల వెలుగులో
చిరునవ్వుల జాబిలి మెరిసిపోతోంది..
దాని చిన్న లోకంలో అల్లిబిల్లిగా పెరిగిన
ఆశల మొలకలు.. ఎంత లేతవో!
ఎరుపు చివుళ్లతో నునులేత మెత్తని పరిమళం..
ఎవర్నైనా ఇట్టే నవ్వుతూ చూసే కన్నుల్లో
ఎంతో అమాయకత్వం..
పసిపాదాల్లో దాగిన చిలిపితనం
పరుగులు పెడుతూ..
ఆకుపచ్చని అలలా ఎగిసి పడుతున్నది!
ఊరకుక్క.. కావలి కళ్లను
మైదానమంతా పరిచే వుంచింది
ఒంటరిగా చిక్కే పసికూనని కబళించడానికి!
అంతూ పొంతూ లేని నిరవధిక భీతి
అమ్మాయి బ్రతుకు దారిని భస్మం చేస్తూ
తుపాను జీవితపు ఆనవాళ్లను కంచెలా కట్టింది
ఏ మూల తాకినా వేడి రక్తం చిందే మృగత్వం
వేళ్లూనుకున్న మాయ స్వేచ్ఛ ఆడజాతికి ఉక్కు సంకెలా!
ఆకలి చూపులూ, మోసపు మాటలూ, వికృత చేష్టలూ
పసితనాన్ని జాలిలేకుండా విచ్చదీసే విచ్చుకత్తుల నడుమ
బతుకంతా నెత్తుటి రహదార్లే..
శిశిరంలో కురిసే అగ్నివర్షమై వెలుగు విస్ఫోటనంలో
చీకటి చరిత్ర పసిదాని బ్రతుకులో లిఖించబడింది
సమాజ మరమత్తు చెయ్యడానికి
మానవత్వం పెంచడానికి,
దానవత్వం తుంచడానికి
అభిమానం పెరగడానికి
ఎన్నో కసరత్తులు నీ తలవాకిట నుండే చెయ్యాలి
మనిషితనం మరిచిన నీ మృగత్వానికి!!

- తుమ్మెర రాధిక, తొర్రూర్, వరంగల్ జిల్లా, సెల్.నం.9440626702
**

నేనొక కవిని

నేనొక కవిని
కలలు కనే సామాన్య మనిషిని
ఆశలు, ఆవేశాలు, బాధలు, సౌఖ్యాలు
ప్రతిబింబించే అక్షర చిత్రకారున్ని!
వేల శ్వాసలకు ఆవాసం
నా కవితా ఉషస్సుల సరస్సు!
నేను నడిచే బాట ఓ కవితల వీచిక
సుఖదుఃఖాల చిత్రిక!
జ్ఞాపకాల అడుసు అగాధాల నుండి
విముక్తికై తపించే మొగ్గలా
వర్తమానంలో విహరిస్తూ రేపటి పొద్దుకై నిరీక్షిస్తూ
వికసించే కలువ.. నా కవితా కుసుమం!
ఊహలకు అక్షర రెక్కలు తొడిగి
ఆలోచనలకు పగ్గాలు వేసి
దానికై దారి వెతుకుతూ, గాలిలో ఈదుతూ
చిటికెడు పలుకులతో కడుపు నింపుకొని
వెళ్లిన దారిలో తిరోగమిస్తూ
చిట్టిపోలేదనుకున్న చిన్ని గూటిలో
విడిచి వెళ్లిన గుడ్లను పొదగాలని
తపించే విహంగ లక్షణమే.. నా కవితా హంగు!
జీవితంలో రాయని అధ్యాయాలెన్నో
వెలుగు నీడల దాగుడుమూతల్లో
పొర్లిన పొరపొచ్చాలెన్నో
పరుగు పందెంలో ఓడినవెన్నో.. గెలిచినవెన్నో
గుగ్గిళ్లు నమిలే పంటికింద రాయిలా
అనుకోని అటంకాల ఆనకట్ట
హాయిగా ఊగే ఊయల వేళ్లాడుతున్న కొమ్మ
హఠాత్తుగా విరిగినట్లు కష్టాల కడగళ్ల వాన!
ఇన్ని నెమరు సురగల నడుమ
అక్షర సంద్రంలో నిత్యం నలుగుతూ
సాహితీ కడవలో కవితా కవ్వం చిలుకుతున్న
కలం పిపాసిని.. నేనొక కవిని!

- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్, సెల్.నం.7893366363
**

నవ భారతం!

దేశము రమ్మంటున్నది
ధీరులారా రండి రండి
మాతృదేశ ప్రగతి కొరకు
నడుము కట్టి నడవండి!
వట్టి వట్టి మాటలొద్దు
పట్టుబట్టి పనిచేయి
దేశభక్తి త్యాగనిరతిని
చేతలలో చూపవోయి
మంచిని పెంచె మనిషె మనిషి
శాంతిని పెంచె మతమె మతం
త్యాగం సత్యం ధర్మం
అనాదిగా మన మార్గం
అన్యాయానికి మనలో
ఆహుతి కానీదెవ్వరు
దారిద్య్రం రూపుమాపకు
పోరాడాలందరూ
సాటి మనిషికి తోడు పడని
చదువూ హోదాలెందుకు
పరుల పీల్చి కూడబెట్టె
పాడు బుద్ధి వద్దు వద్దు
దేశము బాగుంటేనే
అందరినీ శాంతి సుఖం
అందరూ సుఖపడే
నవ భారతమే మన ధ్యేయం!

- జి.కాళిదాసు, కరీంనగర్, సెల్.నం.8686706463
**

చిగురు మొక్కనై..!

అల్లిబిల్లి తారలతో
ఆకాశం అల్లుకుందేమో కాని
నా మనసు కాదు
బాహ్య ప్రపంచమంత
చీకటి అలుముకుందేమోకాని
నా ఆత్మకాదు
పచ్చదనమంతా నేడు మోడువారి
ఎండిపోయిందేమో కాని
నా హృదయం కాదు
బంధాలు, అనుబంధాలు
చచ్చిపోతున్నాయేమోకాని
మానవ సంబంధాలు కాదు
పూలు పుష్పించి ఎండిపోతుంటాయి
ఫలాలు కాచి పండిపోతుంటాయి
కాని నేను నేనుగా ఉండాలని
శాసించె శక్తిగా ఎదగాలని
పుడమి మీద నా ఉనికి
చిరకాలం నిలవాలని
ప్రకృతితో నా స్నేహం
కలకాలం వుండాలని
అనంతమైన ఆలోచన తెంపరలతో
నిరంతరం చిగురుమొక్కనై..

- రాజేశ్వరి బొమ్మిదేని
పెద్దపల్లి
సెల్.నం.9160908045