తెలంగాణ

హమాలీల రేట్లను పెంచిన చాంబర్ ఆఫ్ కామర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట,డిసెంబర్ 27: ఏనుమాముల మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీల కూలీ రేట్లను చాంబర్ కామర్స్ పెంచడంపై వివిధ హమాలీ సంఘాల నాయకులు హర్షం వ్యకం చేశారు. మంగళవారం హమాలీ సంఘాల నాయకులతో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కటకం పెంటయ్య, ప్రతి నిధులతో సంయుక్త సమావేశం జరిగింది. హమాలీలకు చాంబర్ ఆఫ్ కామర్స్‌కు కుదుర్చుకున్న ఒప్పంద గడువు ముగిసినందున, తిరిగి హమాలీల కూలీ రేట్ల హెచ్చింపుపై చాంబర్ ఆఫ్ కామర్స్, హమాలీ సంఘాలు పలు అంశాలపై చర్చించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వరంగల్ లేబర్ కమీషనర్ ఆదేశాల మేరకు ధరలను నిర్ణయించాలనే ప్రకారం రేట్లను పెంచడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ధరల రేటు 13.88 శాతం ఉండగా, యూనియన్ నాయకులు ఇంకా కొంత రేట్లను పెంచాలని కోరగా, ప్రస్తుతం ఉన్న రేట్లపై 15 శాతం పెంచారని పేర్కొన్నారు. హమాలీ సంఘాల నాయకులు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు గోపాల్‌రావు, రవీందర్‌రెడ్డి, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.