హైదరాబాద్

డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం స్థలాల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: మహానగరంలో నిలువ నీడలేని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి నగరంలో గుర్తించిన స్థలాల వివరాలను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా తహసిల్దార్లను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎన్ని స్థలాలు గుర్తించారు? ఇందులో ఎన్నింటిని జిహెచ్‌ఎంసికి అప్పగించారన్న వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 9వ తేదీలోపు తనకు సమర్పించాలని ఆయన ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాలపై కలెక్టర్ తహసిల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి వివాదాల్లేని స్థలాలను ఎంపిక చేసి పోజీషన్ ఇచ్చేందుకు అనువైన స్థలాలను గుర్తించి, వాటినే నివేదికలో చేర్చాలని సూచించారు. నగరంలో వివిధ శాఖలకు ప్రజావసరాల నిమిత్తమై భూములు ఇవ్వటం జరిగిందని, వాటిని ఇప్పటి వరకు వినియోగించుకోనందుకు ఆయా శాఖలకు నోటీసులు కూడా ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ రకమైన భూముల వివరాలను కూడా నివేదికలో చేర్చాలని ఆదేశించారు. ఇవే కాకుండా ప్రభుత్వ ఖాళీ స్థలాలపై ఖచ్చితమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చాలన్నారు. కోర్టు కేసులున్న భూములకు సంబంధించి ఏ రకమైన కేసులున్నాయి? ఎంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి? అనే వివరాలతో కేసులు వివరాలను సమర్పించాలన్నారు. ఆయా మండలాల్లో మేజర్ కోర్టు కేసులు, వివాదాలు గల భూముల కేసులను నివేదికలో చర్చాలని వివరించారు. ఈ రకంగా మండలానికి సంబంధించి ఒక ఫోల్డర్‌ను తయారు చేసి పంపాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల స్థలాల ఎంపికకు సంబంధించి సంబంధిత జిహెచ్‌ఎంసి ఇంజనీర్లతో సంప్రదించాల్సిందిగా తహసిల్దార్లను ఆదేశించారు. ఈ అంశంపై ఎమ్మార్వోలకు సహకరించాల్సిందిగా హౌజింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు సూచించారు. మహిళ, శిశు సంక్షేమ, కార్మిక, పోలీసు శాఖలు కలిసి జిల్లాల్లో నిర్వహించబోయే ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమానికి తహసిల్దార్లు పూర్తి సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ అంశంపై తహసిల్దార్లు సానుకూలంగా వ్యవహారించి బలవంతంగా, వెట్టి పనిలో మగ్గుతున్న పిల్లలు, మహిళలను విడిపించాలని ఆదేశించారు. యాజమాన్యాలపై కేసులు నమోదు చేయడంలో సంబంధిత శాఖలకు సహకరించాలన్నారు. బలవంతంగా చిన్నారులచే పని చేయించటం వెట్టిచాకిరి కిందకే వస్తోందని, ఇందులో ఎమ్మార్వోలు సందేహించాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఆర్వో సతీష్‌చంద్ర, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి కుసుమకుమారి, తహశీల్దార్లు పాల్గొన్నారు.

జలమండలి ఆధ్వర్యంలో
నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్, జనవరి 2: జలమండలి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జలమండలి ఎండి ఎం.దానకిషోర్.. బోర్డు ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఎండి ఉద్యోగులకు, వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, బోర్డు పేరు ప్రఖ్యాతలు మరింత విస్తరింప చేయాలని ఎండి సిబ్బందికి సూచించారు. అనుకున్న సమయంలో నగర శివార్లలో చేపట్టిన హడ్కో ప్రాజెక్ట్, ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్, 20 టిఎంసిల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ల నిర్మాణ ప్రాధాన్యతలను వివరించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ట్వీట్టర్, ఫేస్‌బుక్, జల్‌యాప్, జి-మిత్ర వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు తృప్తి చెందేలా మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మర్గాలు అనే్వషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వేడుకల్లో ఇడి, ఇఎన్‌సి ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్ జి.రామేశ్వరరావు, పిఅండ్‌ఎ విభాగం డైరెక్టర్ అజ్మీరాకృష్ణ, ఫైనాన్స్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఎంబి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.